తాజాగా వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. డ్రైవింగ్ లైసెన్స్(డీఎల్), రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్(ఆర్‌సీ) పొడగింపు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల జూన్ 30 వరకు ఉన్న డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ వంటి పలు వాహన పత్రాల గడువును తాజాగా 2021 సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. దీనికి సంబందించి నోటిఫికేషన్ ను రోడ్డు & రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ జారీ చేసింది. “కరోనా మహమ్మరి వ్యాప్తిని అరికట్టడానికి ఫీట్ నెస్, పర్మిట్(అన్ని రకాల), లైసెన్స్, రిజిస్ట్రేషన్ వంటి ఇతర డాక్యుమెంట్(ల) గడువును 30 సెప్టెంబర్ 2021 వరకు పొడగించినట్లు” కేంద్రం ట్వీట్ చేసింది.
ప్రస్తుతం ఈ గడువు పొడగించడం వల్ల గత ఏడాది ఫిబ్రవరి 1 ముగిసిన అన్నీ వాహన పత్రాల గడువు కూడా సెప్టెంబర్ 30, 2021 నాటికి పొడగించినట్లు అయ్యింది. తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సామాజిక దూరాన్ని పాటిస్తూ రవాణా సంబంధిత సేవలను పొందవచ్చు అని తెలిపింది. ఈ క్లిష్ట సమయంలో పౌరులు, రవాణాదారులు ఇబ్బందులను ఎదుర్కొనకుండా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సహకరించాలని కేంద్ర మంత్రిత్వ శాఖ కోరింది.
ఇంకా, గతంలో రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ డ్రైవర్ ట్రైనింగ్ సెంటర్లు, డ్రైవింగ్ లైసెన్స్ జారీ విషయంలో నిబంధనలలో కొన్ని మార్పులు చేసింది. ఇంతకు ముందు, కొత్తగా లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునే వారు ఆర్టివో కార్యాలయలలో టెస్ట్ డ్రైవింగ్ తప్పనిసరిగా చేయాల్సి వచ్చేది. కేంద్రం తీసుకొచ్చిన కొత్త నిబందనల ప్రకారం, ప్రభుత్వం గుర్తించిన, అర్హత కలిగిన డ్రైవర్ ట్రైనింగ్ కేంద్రాల్లో డ్రైవింగ్ టెస్ట్ పాస్ అయిన అభ్యర్థులు డ్రైవింగ్ లైసెన్స్ కోసం ప్రత్యేకంగా ఆర్టివో కార్యాలయంలో ప్రత్యేకంగా టెస్ట్ డ్రైవ్ చేయాల్సిన అవసరం లేదు.
Support Tech Patashala

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.