111 GO: 111 జీవోను ఎందుకు తీసుకొచ్చారు..? దీనివల్ల కలిగే లాభనష్టాలు ఏమిటి

0
What Is 111 GO In Telangana
What Is 111 GO In Telangana

What Is 111 GO In Telangana: ఎంతో కాలం నడుస్తున్న 111 జీవో వివాదానికి తెలంగాణ ప్రభుత్వం స్వస్తి పలికిన సంగతి తెలిసిందే. గత కొద్ది రోజుల క్రితం ఈ జీవో రద్దుకు తెలంగాణ కేబినెట్ కూడా ఆమోదముద్ర వేసింది. దీంతో ఒక్కసారిగా అందరిచూపు ఆ ప్రాంతంపై పడింది. రియల్ ఎస్టేట్ పరంగా ఆ ప్రాంతం దూసుకెళ్లటం ఖాయమని.. హైదరాబాద్తో పాటు సమాంతరంగా మరో నగరం నిర్మాణం జరగటం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో అసలు ఈ జీవోను ఎందుకు తీసుకొచ్చారు..? ఈ జీవో ఎత్తివేస్తే ఎవరికి లాభం.. ఎవరికి నష్టం..? అనే విషయాల గురించి పూర్తిగా తెలుసుకుందాం.

111 జీవోను ఎందుకు తీసుకొచ్చారు..?

హైదరాబాద్ మహా నగరానికి తాగు నీరు అందించేందుకు నిజాం పాలకుల హయాంలో జంట జలశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లను నిర్మించిన సంగతి మన అందరికీ తెలిసిందే. కొన్నాళ్ల క్రితం వరకు ఈ జంట జలాశయాలే హైదరాబాదీల తాగు నీటి అవసరాలను తీర్చేవి.

(ఇది కూడా చదవండి: How To Know PTIN Number: తెలంగాణలో పీటీఐఎన్ నెంబర్ తెలుసుకోవడం ఎలా..?)

అయితే, ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ జలాశయాలను కాపాడుకోవడం కోసం.. 1996లో అప్పటి ప్రభుత్వం 111 జీవోను తీసుకొని వచ్చింది. ఈ జలాశయాల్లోని త్రాగు నీరు కలుషితమైతే.. ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందనే కారణంతో ఈ జీవోను అప్పుడు జారీ చేశారు. ఈ జీవో ప్రకారం జంట జలాశయాల చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాన్ని బయో కన్జర్వేషన్ జోన్‌గా అప్పటి ప్రభుత్వం ప్రకటించింది.

111 జీవో పరిధి ఎంత..?

రంగారెడ్డి జిల్లాలోని ఏడు మండలాలకు చెందిన 84 గ్రామాలు ఈ జీఓ పరిధిలోకి వస్తాయి. ఈ ప్రాంత విస్తీర్ణం దాదాపు 538 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. అంటే ఇది దాదాపు ప్రస్తుత జీహెచ్ఎంసీ విస్తీర్ణానికి సమానం. ఈ 84 గ్రామాల్లోని 1 లక్షా 32 వేల ఎకరాల విస్తీర్ణంలో వ్యవసాయేతర కార్యకలాపాలపై నిషేధం విధించారు.

హైదరాబాద్ మహానగరానికి అత్యంత చేరువలో ఉన్న ఇంత పెద్ద మొత్తంలోని భూములను కేవలం వ్యవసాయ కార్యకలాపాలే కేటాయించాలని ఆదేశించడంతో.. ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ సహా అనేక కార్యకలాపాలకు అప్పటి నుంచి బ్రేక్ పడింది.

కానీ నిబంధనలకు విరుద్ధంగా చాలా మంది వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు.. ఈ జీవో పరిధిలోకి వచ్చే భూముల్లో ఇప్పటికే భారీగా పెట్టుబడులు పెట్టారు. ఇక్కడ వందల సంఖ్యలో ఫామ్ హౌసులు, విల్లాలు వెలిశాయి. తాము అధికారంలోకి వస్తే 111 జీవోను ఎత్తేస్తామని పార్టీలు హామీలు ఇవ్వడమే ఇందుకు కారణం.

స్థానికులు సైతం ఈ జీవోను ప్రభుత్వం ఎప్పుడెప్పుడు ఎత్తేస్తారా..? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ జీవోను ఎత్తేయాలని కోరుతూ గతంలో చాలా మంది న్యాయస్థానాలను ఆశ్రయించారు. కొంత పర్యావరణవేత్తలు సైతం ఈ జీవోను ఎత్తివేయొద్దని కోరుతూ కోర్టు మెట్లెక్కారు.

ఈ జీవోను ఎత్తివేసే విషయం తేల్చడం కోసం తెలంగాణ ప్రభుత్వం 2016లో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. కానీ, ఈ కమిటీ ఇంత వరకూ నివేదిక సమర్పించలేదు. దీంతో ఈ కమిటీ నివేదికను సమర్పించాలని తెలంగాణ సర్కారును హైకోర్టు కోరినప్పటికీ.. కొంత గడువు కావాలని కోరాలని ప్రభుత్వం నిర్ణయించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here