ఈ పోస్టాఫీసు స్కీమ్‌లో చేరితే ప్రతి నెల రూ.5వేలు మీ సొంతం

0

పోస్టాఫీసుల్లో అనేక కొత్త రకాల పథకాలను ప్రవేశపెడుతోంది కేంద్ర ప్రభుత్వం. అన్నీ వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకొని చాలా కొత్త రకాల పథకాలను అందుబాటులోకి తీసుకొస్తుంది పోస్టల్ శాఖ. ప్రస్తుతం మధ్య తరగతి ప్రజల కోసం ఒక కొత్త పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఎవరి దగ్గరైన డబ్బు ఉండి ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలనే వారి కోసం పోస్టల్‌ శాఖ ఒక కొత్త ఆప్షన్‌ తీసుకొని వచ్చింది. ఇందులో పెట్టుబడి పెట్టడం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి నెల రాబడి పొందవచ్చు.(ఇది చదవండి: ఎల్‌పీజీ గ్యాస్ వినియోగదారులకు భారీ షాక్!)

పోస్టాఫీస్ కొత్తగా తీసుకొచ్చిన మంత్లి ఇన్‌కమ్‌ స్కీమ్ చేరితే ప్రతినెల డబ్బులు వస్తాయి. అయితే ఇందులో సింగిల్‌ లేదా జాయింట్‌ అకౌంట్‌ తెరవచ్చు. దీనిలో కనీసం రూ.1000 నుంచి రూ.4.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. అయితే ఇందులో వెయ్యి రూపాయలు పెడితే మీకు పెద్దగా లాభం ఉండక పోవచ్చు. మీరు కనుక మీ ఇంట్లో ఉన్న వారి పేరుతో జాయింట్‌ అకౌంట్‌ తీసుకొని రూ.9 లక్షలు డిపాజిట్‌ పెట్టుబడి పెడితే మీకు చాలా లాభం చేకూరనుంది. ఇందులో ఒకేసారి డబ్బులు పెట్టుబడి పెట్టాలి. తర్వాత ప్రతి నెల రాబడి పొందే అవకాశం ఉంటుంది. రిటైర్డ్‌ అయిన ఉద్యోగులకు, సీనియర్‌ సిటిజన్స్‌కు ఈ స్కీమ్‌ చాలా అనుగుణంగా ఉంటుంది.(ఇది చదవండి: వైరల్: ఈ వాట్సాప్ మెసేజ్ తో జర జాగ్రత్త!)

ఉదాహరణకు: మీరు జాయింట్‌ అకౌంట్ కింద ఈ స్కీమ్ లో రూ.9 లక్షల పెట్టుబడి పెట్టారని అనుకుందాం. మీకు ప్రతి ఏడాదికి రూ.6.6 వడ్డీ రేటు కింద రూ.59,400 వేల వడ్డీ లభిస్తుంది. దీనిని 12 నెలలతో భాగిస్తే మీకు ప్రతి నెల రూ.4,950లు మీ అకౌంట్ లో జమ అవుతాయి. దీనికోసం మీరు దగ్గరలోని పోస్టాఫీసుకు వెళ్లి మంత్లి ఇన్‌కమ్‌ స్కీమ్‌లో చేరవచ్చు. ఈ ఐడీ ఫ్రూప్‌, అడ్రస్‌ ఫ్రూప్‌, రెండు పాస్‌ పోర్ట్‌ సైజు ఫోటోలు వంటికి అందజేయాల్సి ఉంటుంది. పోస్టాఫీసులో ఫారం నింపి మంత్లి ఇన్‌కమ్ ఖాతాను తెరుచుకోవచ్చు. మీరు పెట్టుబడి పెట్టిన డబ్బులను ఐదేళ్ల తర్వాత వెనక్కి తీసుకోవచ్చు. అంత వరకు ప్రతినెలా వడ్డీ డబ్బులు వస్తుంటాయి. పూర్తి వివరాల కోసం ఈ Post Office Monthly Income Scheme Account (MIS) లింకు క్లిక్ చేయండి.

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here