మనం చాలా సార్లు ఎక్కువగా వినే పదం ఒక్క నిమిషంలో కాలం ఏమి మారిపొదు అనీ.. కానీ ప్రస్తుత ఇంటర్ నెట్ ప్రపంచంలో చాలానే జరుగుతున్నాయి. అసలు ఇన్ని జరుగుతాయ అనే విషయం మనకు తెలీదు ఎందుకంటే మనకు కాలం విలువ తెలీదు కాబట్టి. 60 సెకండ్లలో ఇంటర్ నెట్ ప్రపంచంలో ఏమి జరుగుతాయో తెలుసుకుందాం.
ప్రస్తుత సమాజంలో ఇంటర్ నెట్ సామాజాన్ని ఉపేస్తున్న సామాజిక మాద్యమలలో మొదటిదైన ఫేస్ బుక్ విషయానికి వస్తే 60 సెకండ్లలో 31,25,000 లైకులు, 13 లక్షల లాగిన్ లు, 1,47,000 ఫోటోలో అప్లోడు చేయబడుతాయనే అనే విషయం మీకు తెలుసా. అదే విదంగా ట్విటర్ విషయానికి వస్తే ఒక నిమిషంలో 3,50,000 ట్వీట్లు మరియు 1,94,444 ఆక్టివ్ యూజర్లు దేనికో ఒక దాని గురుంచి వెతుకుతూ ఉంటారు. మరి వాట్సప్ విషయంలో మాత్రం నమ్మలేని విషయాలు చాలా ఉన్నాయి. అవి ఏంటి అంటే ఒక నిమిషంలో ప్రపంచ వ్యాప్తంగా 5.9 కోట్ల మెసేజ్ లు పంపుకుంటారు. 4,16,66,667 మెసేజ్ లను ఎవరో ఒకరు చదువుతూ ఉంటారు. ఇకా, ఆకర్షణీయమైన ఇనస్టాగ్రామ్ లో మాత్రం 60 సెకండ్లలో 6,94,444 ఫోటోలో కోసం స్క్రోలింగ్ చేస్తూ ఉంటారు.
ఇకా వినోదం విషయానికి వస్తే మాత్రం చాలానే జరుగుతున్నాయి. అన్నిటికంటే ప్రముఖమైన యూట్యూబ్ లో ఒక నిమిషంలో 500 గంటల నిడివి గల వీడియో లు అప్లోడు చేయబడుతున్నాయి మరియు 47 లక్షల వ్యూస్ వస్తున్నాయి. ఇకా నెట్ ఫ్లిక్స్ లో ఒక నిమిషంలో 7,64,000 గంటల వీడియోలు స్ట్రీమింగ్ అవుతుంటాయి. ప్రముఖ సర్చ్ ఇంజిన్ అయిన గూగుల్ లో 41 లక్షల సెర్చ్ లు జరుగుతుంటాయి దేనికో ఒక విషయనీకి ఒక నిమిషంలో. ఒక నిమిషంలో మెయిల్ లో 19 కోట్ల మెయిల్ లు పంపబడుతాయి, వి చాట్ లో 1.9 కోట్ల మెసేజ్ లు పంపుకుంటారు. నిమిషంలో ప్లే స్టోర్ నుండి 4 లక్షల యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటారు.
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.