గుడ్‌న్యూస్‌: యూజర్ల ప్రైవసీ కోసం “వాట్సాప్”లో మరో సరికొత్త ఫీచర్

0

ఈ కొత్త ఏడాది ప్రారంభంలో వాట్సాప్ కొత్తగా తీసుకొచ్చిన ప్రైవసీ పాలసీపై రచ్చ జరిగిందో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వాట్సాప్ తీసుకురానున్న కొత్త ప్రైవసీ నిబందనలలో యూజర్ల వ్యక్తిగత భద్రత ప్రశ్నార్థకంగా మారింది అంటూ పెద్ద ఎత్తున వాదనలు వినిపించాయి. వివిద దేశాలలో వివద రకరకాలుగా నిబందనలు తీసుకురావడంతో వాట్సాప్ కేంద్రం కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పనిసారిగా నిబందనలను అంగీకరించాలనే నిబందనపై కేంద్రం వాట్సాప్’ను ప్రశ్నించింది.(ఇది చదవండి: షాకింగ్ న్యూస్: టిక్‌టాక్‌తో సహా 58 యాప్‌లపై శాశ్వత నిషేధం?)

ఇదిలా ఉంటే తాజాగా వాట్సాప్ తన యూజర్ల వ్యక్తిగత భద్రత విషయంలో మరో ముందడుగు వేసింది. దీనిలో బాగంగానే మరో కొత్త ఫీచర్ వాట్సాప్ తీసుకురాబోతుంది. ప్రస్తుతం డెస్క్‌టాప్‌లో మనం వాట్సాప్ లాగిన్ కావాలంటే నేరుగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే సరిపోయేది. కానీ ఇక నుంచి.. అలా కాకుండా యూజర్లు తమ ఖాతాలను కంప్యూటర్‌కు లింక్ చేసే ముందు ఫింగర్ ప్రింట్ లేదా ఫేస్ ఐడిని ఉపయోగించి ఆన్ లాక్ చేసిన తర్వాత క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాల్సి ఉంటుంది.(ఇది చదవండి: ఈ రెండు సెట్టింగ్స్ మారిస్తే మీ వాట్సప్ ఖాతా మరింత సురక్షితం!)

దీంతో ఈ ఫీచర్ ద్వారా మీ వాట్సాప్ ఖాతాలను ఇతరులు కంప్యూటర్‌కు లింకు చేయకుండా అడ్డుకుంటుంది. దీని ద్వారా మీ వ్యక్తి గతకు మరింత రక్షణ లభిస్తుందని వాట్సాప్ తెలిపింది. ప్రస్తుతం ఈ కొత్త ఫీచర్ ఇంకా అభివృద్ది దశలో ఉందని, త్వరలోనే అందరికీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నామని వాట్సాప్ ప్రతినిధులు తెలిపారు.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్(Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్(YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here