బ్రేకింగ్: వాట్సాప్ నుంచి మరో బిగ్ అప్‌డేట్

0

ప్రపంచంలో వ్యాప్తంగా భాగా గుర్తింపు పొందిన మెసేజింగ్ యాప్ లలో వాట్సాప్ మొదటి స్థానంలో ఉంటుంది. ఇంతలా అదరిస్తున్న తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ & అప్డేట్ లు తీసుకొస్తుంది. కరోనా మహమ్మారి కారణంగా అందరూ ఎక్కడికి వెళ్లలేని కారణంగా వ్యక్తిగత అవసరాల కోసం, బిజినెస్ కోసం ఎక్కువగా వాట్సాప్ మీద ఎక్కువగా ఆధారపడ్డారు. అందుకే గతంలో ఎన్నడూ లేని విదంగా 2020లో ఎక్కువ మొత్తంలో ఫీచర్స్ తీసుకొనివచ్చింది.

ఇంకా చదవండి: ఫేస్‌బుక్ ప్రొఫైల్ లాక్ చేయడం ఎలా..?

వాట్సాప్ కొత్త నిబందనలు:

గత ఏడాది డిసెంబర్ లో ఎవరైతే రాబోయే వాట్సాప్ కొత్త నిబంధనలను అనుమతించరో వారి మొబైల్ ఫోన్ లలో పేర్కొన్నట్లుగా తమ సేవలను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు తాజాగా ఫిబ్రవరి 8, 2021 నాటికి తమ కొత్త సేవా నిబంధనలను తీసుకురాబోతునట్లు గతంలోనే ప్రకటించాము. ఇప్పుడు ఆండ్రాయిడ్ 2.21.1.1 అప్‌డేట్ లో బాగంగా వాట్సాప్ బీటా వినియోగదారుల కోసం 2021లో ఈరోజు నుండి తమ వాట్సాప్ సేవా, నిబందనలను అంగీకరించమని దశల వారీగా అందరికి పంపించడం జరుగుతుంది అని తన వాబీటా బ్లాగ్ లో పేర్కొంది. ఈ కొత్త నిబంధనలను ఒకవేల అంగీకరించకపోతే మీ మొబైల్ లో వాట్సప్ సేవలు నిలిచిపోనునట్లు ప్రకటించింది.

ఈ కొత్త నిబంధనలను అంగీకరించడం వల్ల మీ అనుభవంలో ఎటువంటి మార్పు లేకున్నప్పటికి దీనిలో యాడ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. గతంలో వాట్సాప్ యొక్క యూజర్ల యొక్క డేటాను అనైతికంగా ఇతర కార్యక్రమాలకు ఉపయోగిస్తుందని నిపుణులు సూచించారు. అందుకే తమ వినియోగదారుల డేటాని ఏ విదంగా ఉపయోగించే దానిపై ఈ కొత్త నిబందనలలో తెలపనున్నట్లు వాట్సప్ పేర్కొంది. అలాగే భవిష్యత్ లో వాట్సప్ లో బ్యానర్ యాడ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది.

మల్టిపుల్ డివైజ్ సపోర్ట్:

ఆండ్రాయిడ్ 2.21.1.1 అప్‌డేట్ లో బాగంగా మన మొబైల్ లో ఇంటర్నెట్ కనెక్షన్ లేకున్నా కూడా ఒకేసారి మల్టిపుల్ డివైజ్ లలో మీ వాట్సాప్ ఖాతాను ఉపయోగించడానికి కొత్త ఫీచర్ ను పరీక్షిస్తునట్లు ప్రకటించింది. ఈ రోజు వాట్సాప్ తమ వినియోగదారులకు వాట్సాప్ వెబ్ బీటాను అందించే అవకాశంపై పనిచేస్తోంది. కాబట్టి వారు మల్టిపుల్ డివైజ్ ఫీచర్ ను ప్రయత్నించవచ్చు. దురదృష్టవశాత్తు ఈ ఫీచర్ ఇంకా అందుబాటులో లేదు, కానీ మేము ప్రివ్యూను మాత్రమే అందించగలము అని పేర్కొంది. మీ ఫోన్‌ను కనెక్ట్ చేయకుండా వాట్సాప్‌ను ఉపయోగించడానికి వినియోగదారుడుకి కొత్త అనుభవాన్ని అందించడానికి వీలుగా వాట్సాప్ వెబ్ ను పరిశీలిస్తోంది అని పేర్కొంది. ఈ ఫీచర్ ఇంకా అభివృద్ధిలో ఉన్నందున కొన్ని ఫీచర్స్ అందుబాటులో ఉండకపోవచ్చు అని తెలిపింది.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్(YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here