వాట్సాప్‌లో మరో సరికొత్త ఫీచర్.. ఇక ఫొటోలూ మాయం!

0

ప్రపంచంలో ప్రస్తుతం ఎక్కువ మంది వాడే మెసేజింగ్ యాప్‌లలో వాట్సాప్‌ ముందు వరుసలో ఉంటుదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఏడాది ప్రారంభంలో కొత్త ప్రైవేసీ నిబంధనలు తీసుకొచ్చిన నేపథ్యంలో ప్రజలలో వాట్సాప్‌పై వ్యతిరేకత వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాట్సాప్ తన‌ వినియోగదారులను నిలుపుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తూ యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.(ఇది చదవండి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల జాబితా విడుదల)

ఇప్పటికే కొద్దీ రోజుల క్రితమే స్టేటస్ లో మ్యూట్ వీడియో, స్వయంగా థర్డ్ పార్టీ అనిమేషన్ స్టికర్స్ క్రియట్ చేసుకునే ఫీచర్స్ తీసుకొని వచ్చింది. ఇప్పుడు తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకురాబోతుంది. ఇప్పటికే గత ఏడాది వాట్సాప్‌లో డిస్‌అపియరింగ్‌‌ మెసేజెస్‌ ఫీచర్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఫీచర్‌ ను యాక్టివ్‌ చేసుకుంటే వారం తర్వాత మెసేజ్‌లు ఆటో మెటిక్ గా డిలీట్‌ అవుతాయి. అదే విదంగా ఇప్పుడు సరికొత్తగా మీడియా డిస్‌అపియరింగ్‌ అనే ఫీచర్ తీసుకువస్తుంది. ఈ ఫీచర్‌తో ఫొటోలు అవతలి వ్యక్తి చూడగానే డిలీట్‌ అయిపోతాయి.

దీని కోసం ఫొటోను షేర్‌ చేసే ముందు, యాడ్‌ కాప్షన్‌ అనే బాక్స్‌ పక్కన ఉన్న గడియారం సింబల్‌ను టచ్‌ చేసి యాక్టివేట్ సరిపోతుంది. ఆ తర్వాత మీరు పంపిన ఫొటోను అవతలి వ్యక్తి చూశాక దానంతట అదే డిలీట్‌ అయిపోతుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ కొంత మందికి ప్రయోగాత్మకంగా అందు బాటులోకి వచ్చింది. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ తరహా ఫీచర్‌ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here