వాట్సాప్ మళ్లీ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. ఈ ఏడాది మొదట్లో తీసుకొచ్చిన ప్రైవసీ పాలసీ నిబందనలు అంగీకరించేలా వాట్సాప్ ఒత్తిడి తీసుకొస్తుంది. ఖాతాదారుల వ్యక్తిగత సమాచారాన్ని ప్రకటనల కోసం వాట్సాప్ మాతృసంస్థ ‘ఫేస్‌బుక్’తో పంచుకునేందుకు వీలు కల్పించేలా కొత్త ప్రైవసీ పాలసీ ఉందని అనేక ఆరోపణలు వచ్చిన విషయం అందరికి తెలిసిందే. గతంలో యూజర్స్ నుంచి అనేక ఆరోపణలు రావడం వల్ల గడువు తేదీని ఫిబ్రవరి 8 నుంచి మే 15 వరకు పొడగించింది.
గడువు తేదీ దగ్గర పడుతుండటంతో కొద్దీ రోజుల క్రితం నిబందనలు అంగీకరించకపోయిన ఖాతాను తొలగించమని పేర్కొంది. కానీ, తాజాగా మరో కొత్త మెలిక పెట్టింది. ఈ కొత్త ప్రైవసీ నిబంధనలకు అంగీకరించకపోతే ఇప్పటికిప్పుడు ఖాతాను తొలగించకున్నా నిబందనలు అంగీకరించని వినియోగదారులు పొందే సేవలను పరిమితం చేస్తామని వాట్సాప్ తాజాగా ప్రకటించింది. కొద్ది వారాల తర్వాత వినియోగదారులు తమ చాట్ లిస్టును చూడలేరని, తర్వాత వాట్సాప్‌లో ఫోన్ కాల్స్‌ను, వీడియో కాల్స్‌ను అందుకోలేరని స్పష్టం చేసింది.
అయితే, మే 15 తర్వాత ఖాతాదారుల తక్షణం వచ్చే ఇబ్బంది ఏమీ ఉండదని, మీ అకౌంట్‌ను తొలగించడం, వాట్సాప్ సేవలకు అంతరాయం కలిగించడం వంటివి చేయమని కొద్దీ రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఇంతలోనే తమ వెబ్‌సైట్‌లో అసలు సమాచారాన్ని బయటపెట్టింది. కొత్త ప్రైవసీ పాలసీలోని నియమనిబంధనలను అంగీకరించాలని వినియోగదారులకు కొద్దివారాల పాటు రిమైండర్లు (గుర్తుచేసే సందేశాలు) పంపుతామని, అప్పటికీ అంగకరించని వారికి నిరంతరం సందేశాలు వెల్లువెత్తుతాయని వాట్సాప్ స్పష్టం చేసింది.
రిమైండర్ల తర్వాత కూడా స్పందించకపోతే అప్పుడు వారు అందుకునే సేవలను పరిమితం చేస్తామని తెలిపింది. ఇలా కొద్దివారాల తర్వాత కూడా కొత్త ప్రైవసీ పాలసీని ఆమోదించని వారికి ఇన్‌కమింగ్ కాల్స్, నోటిఫికేషన్స్, మెసేజ్‌లు నిలిపివేస్తామని వాట్సాప్ ప్రకటించింది. ఎవరైనా వాట్సాప్‌ను 4 నెలల పాటు వినియోగించకపోతే సదరు ఖాతాను వాట్సాప్ తొలగిస్తుంది. అంటే ప్రైవసీ పాలసీని అంగీకరించకపోతే కొద్దివారాల తర్వాత మన ఫోన్‌లో వాట్సాప్ సేవలు నిలిచిపోతాయి.
మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.