ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ యూజర్లకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్ తీసుకొస్తున్న వాట్సప్. ఇప్పుడు కొత్తగా వస్తున్న ఒక నిబందన మాత్రం వాట్సప్ యూజర్లను చాలా ఆందోళనకు గురి చేస్తుంది. ఈ కొత్త నిబందన ఫిబ్రవరి 8 నుండి అమల్లోకి వస్తుంది. వాట్సప్ సంస్థ తెలిపిన ప్రకారం ఈ వచ్చే ఏడాది రాబోయే కొత్త నిబందనలను అంగీకరించకపోతే మీ వాట్సప్ ఖాతా సేవలను నిలిపివేయనున్నట్లు పేర్కొంది. దీనికి సంబందించిన ఒక స్క్రీన్ షాట్ ను తన అధికారిక బ్లాగ్ అయిన వీబీటఇన్ఫోలో షేర్ చేసింది.(చదవండి: ట్రెండింగ్: పొరపాటున 42ఆర్డర్‌లు బుక్ చేసిన చిన్నారి)
ఎప్పుడు కొత్తగా రాబోయే ఫీచర్స్, నిబందనల గురుంచి గాని ముందే వినియోగదారులకు షేర్ చేయదు. కానీ, ఈ సారి కొత్తగా స్క్రీన్ షాట్ ను షేర్ చేయడం విశేషం. గత కొంత కాలంగా వాట్సప్ వినియోగదారుల డేటా భద్రత విషయంలో అనేక విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ నిబందనలు తీసుకురావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వాట్సప్ షేర్ చేసిన స్క్రీన్ షాట్ లో ఈ విదంగా ఉంది. “వాట్సాప్ కొత్త అప్‌డేట్ గురించిన మరింత సమాచారంతో యూజర్ డేటాను వాట్సాప్ మాతృ సంస్థ ఫేస్‌బుక్ ఎలా వినియోగిస్తుందనే దానిపై వివరణ ఇస్తాం. అదేవిధంగా ఫేస్‌బుక్ అందించే అన్ని రకాల సేవలకు సంబంధించిన ఛాటింగ్ సమాచారాన్ని వ్యాపార అవసరాల కోసం ఎలా వాడుకునే దానిపై కూడా అందులో తెలియజేస్తాం. ఒకవేళ ఈ నిబందనలు అంగీకరించని యూజర్లు అకౌంట్ అనేది ఫిబ్రవరి 8 తర్వాత నిలిపివేస్తాం” అని పేర్కొంది. త్వరలో దీనికి సంబందించిన సమాచారం అధికారికంగా వెలువడనుంది. గత కొద్దీ నెలలుగా వాట్సాప్ పేమెంట్స్, డిస్‌అపియరింగ్ మెసేజెస్, వాట్సాప్ షాపింగ్ బటన్, ఛాట్ వాల్‌పేపర్స్, స్టోరేజ్ మెనేజ్‌మెంట్ వంటి ఫీచర్స్ ని తీసుకొచ్చింది.
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.