2021 నుండి ఈ స్మార్ట్‌ఫోన్‌లలో నిలిచిపోనున్న వాట్సప్ సేవలు

0

ప్రపంచ వ్యాప్తంగా భాగా గుర్తింపు పొందిన మెసేజింగ్ యాప్ లలో వాట్సాప్(WhatsApp) మొదటి స్థానంలో ఉంటుంది. అందుకే ఇంతగా అదరిస్తున్న తన వినియోగదారులకోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తీసుకోస్తూ ఉంటుంది. అలాగే కొద్దీ రోజుల క్రితం ఒక నిబందన తీసుకొచ్చింది. 2021 నుండి కొన్ని పాత ఐఫోన్‌లు మరియు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో తన వాట్సప్ సేవలను నిలిపివేస్తునట్లు సంస్థ ప్రకటించింది. ఫేస్‌బుక్ యాజమాన్యంలోని వాట్సప్ ప్లాట్‌ఫామ్‌లో కొన్ని లక్షణాలను పూర్తిగా ఉపయోగించలేకపోవచ్చు.

ఇంకా చదవండి: కొత్త పాన్ కార్డు ఇంట్లో నుంచి పొందండి ఇలా?

ఐఓఎస్ 9 లేదా ఆండ్రాయిడ్ 4.0.3 వెర్షన్ గల స్మార్ట్‌ఫోన్‌ల కంటే తక్కువ వెర్షన్ గల స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు మీ ఫోన్ ని అప్‌గ్రేడ్ చేయక పోతే వారి స్మార్ట్‌ఫోన్‌లలో వాట్సాప్(WhatsApp) సేవలు నిలిచిపోనున్నాయి. వినియోగదారులు తమ ఆపరేటింగ్ సిస్టమ్ ను అప్‌డేట్ చేసుకోవాలని యాప్ తయారీదారులు సలహా ఇస్తున్నారు. అప్‌డేట్ చేయలేని వారు కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలి లేదా వాట్సాప్‌కు ప్రత్యామ్నాయాల కోసం వేతకాల్సి ఉంటుంది. కొత్తగా వస్తున్న ఫీచర్స్ ప్రతి ఒక్కరికీ అందుబాటులో తేవడం కోసం ఈ చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని సంస్థ ప్రతినిదులు తెలుపుతున్నారు. కొత్తగా తీసుకొచ్చే కొన్ని ఫీచర్స్ ఐఓఎస్ 9 లేదా ఆండ్రాయిడ్ 4.0.3 వెర్షన్ గల స్మార్ట్‌ఫోన్‌లలో పనిచేయవని వారు పేర్కొన్నారు.

వాట్సప్ నిలిచిపోనున్న జాబితా

ఇప్పటికీ ఐఫోన్ 4 లేదా తక్కువ మోడల్‌ మొబైల్ కలిగి ఉన్న వినియోగదారులు యాక్సెస్ కోల్పోతారు. అదేవిధంగా ఎవరైనా శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 2 ఉపయోగిస్తుంటే వారు వాట్సాప్‌ను ఉపయోగించలేరు. ఐఫోన్ పరికరాల్లో సిస్టమ్ అప్‌గ్రేడ్ చేయడం చాలా సులభం ఎందుకంటే ‘సెట్టింగులు’ తరువాత ‘జనరల్’ లోకి వెళ్లి, ఆపై ‘సాఫ్ట్‌వేర్ అప్‌డేట్’ నొక్కండి. ఇది వారు నడుపుతున్న OS యొక్క ఏ వెర్షన్ మరియు వారు అప్‌గ్రేడ్ చేయగలరా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి వారికి సహాయపడుతుంది. మరోవైపు, ఆండ్రాయిడ్ యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్‌లోని ‘సెట్టింగులు’లోని ‘ఫోన్ గురించి’ విభాగంలో దీన్ని కనుగొంటారు. వాట్సాప్(WhatsApp) సేవలు నిలిపివేసే వేసే జాబితాలో ప్రముఖ ఫోన్‌లైన హెచ్‌టిసి సెన్సేషన్, శామ్‌సంగ్ గూగుల్ నెక్సస్ ఎస్, సోనీ ఎరిక్సన్ ఎక్స్‌పీరియా ఆర్క్, ఎల్‌జి ఆప్టిమస్ 2 ఎక్స్, శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ ఐ 9000, హెచ్‌టిసి డిజైర్ ఎస్ వంటివి ఉన్నాయి.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్(YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here