ప్రతి పర్యటనలో నరేంద్ర మోడీ పక్కన ఉన్న ఈ మహిళా ఎవరు?

0

పైన చూపించిన ఫోటోలోతో పాటు ఇతర ఫోటోలలో మోడీ పక్కనే ఉన్న ఈ మహిళా ఎవరు అనే సందేహం మీకు ఎప్పుడైనా కలిగిందా. కేవలం ఈ ఒక్క పర్యటనలో మాత్రమే కాకుండా, ప్రతి పర్యటనలో మోడీ పక్కనే ఆమెను మీరు చూసే ఉంటారు. ఆమె పేరు నీలక్షి సాహా సిన్హా. ప్రధాన మంత్రి మోడీ దేశ భవిష్యత్ దృష్ట్యా అనేక దేశాలలో పర్యటిస్తుంటారు. ఇలా ఆయా దేశాలలో పర్యటించినప్పుడు ఆ దేశ నేతలతో మాట్లాడేటప్పుడు మోడీకి సహాయం అందిస్తుంది. వారు మాట్లాడే ప్రతి అక్షరాన్ని మోడీకి వివరిస్తుంది. ఆమె ప్రధాన మంత్రి అనువాదకురాలు.

ప్రధాని మోడీ ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు లేదా ఇతర దేశాల అధ్యక్షులు, ప్రధాన మంత్రులు మన దేశంలో పర్యటించినప్పుడు ఆమె మోడీకి వారు ప్రతి మాటను అనువాదం చేసి వివరిస్తుంది. మోడీ ఎలా మాట్లాడుతారో ఆమెకు తెలుసు, బరాక్ ఒబామా ఫ్రాంకోయిస్ హోలాండే వంటి వారితో మాట్లాడినప్పుడు ఆమె అనువాదం చేసింది. ‎‎ప్రధాన మంత్రి ఎక్కువ శాతం హిందీలో మాట్లాడటానికి ఇష్టపడతారు. ఇతర దేశాల నాయకులకు పీఎం ఏమి మాట్లాడుతున్నారో వివరిస్తుంది.

ఆమె‎‎ ‎‎హిందీ, బెంగాలీ, ఇంగ్లీష్ భాషలలో అనర్గళంగా మాట్లాడుతుంది, ‎అంతకంటే ఎక్కువ ఫ్రెంచ్ లో మాట్లాడుతుంది. ఎందుకంటే ఆమె పారిస్ లో చదువుకుంది. ప్రస్తుత సమాచారం ప్రకారం సౌత్ బ్లాక్లో ఆమెతో పాటు మరో ఏడుగురు భాష అనువాదికులు ఉన్నారు. ప్రస్తుతం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన అధికారులకు రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని విదేశీ భాషల నైపుణ్యాలను పెంపొందించుకునేలా శిక్షణ ఇప్పిస్తుంది.

Support Tech Patashala

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here