ఆపిల్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నా ఐఫోన్12 చివరకి అక్టోబర్ 13న మార్కెట్ లోకి వచ్చేసింది. గత వారంలో నిర్వహించిన వర్చువల్ ఈవెంట్ లో ఆపిల్ ఐఫోన్ 12 సిరీస్ కు చెందిన మొబైల్ లను విడుదల చేసింది. ముందునుంది చెప్పుకున్నట్లు గానే ఆపిల్ ఐఫోన్ 12 మొబైల్ బాక్స్ లో యూఎస్‌బీ అడాప్టర్, ఇయర్‌పాడ్స్‌ను బాక్స్ నుంచి తొలగించింది. అయితే యూఎస్‌బీ అడాప్టర్, ఇయర్‌పాడ్స్ తొలగింపుపై ప్రపంచ వ్యాప్తంగా చాలా విమర్శలు వస్తున్నాయి. ఆపిల్ కి ప్రధాన ప్రత్యర్డీ అయిన శాంసంగ్ ట్రోల్ చేసింది. ‘మీ గెలాక్సీ వినియోగదారులు కోరుకున్నవాటిని అన్నింటినీ ఇస్తుంది. కనీస అవసరమైన ఛార్జర్ నుంచి ఉత్తమమైన కెమెరా, బ్యాటరీ, పనితీరు, మెమొరీ, అలాగే 120 హెర్ట్జ్ స్క్రీన్’ అని యాపిల్‌ను ట్రోల్ చేస్తూ వ్యంగ్యంగా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది.(చదవండి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరుగా పేరు నమోదు చేసుకోవడం ఎలా..?)
అయితే ఇలా వస్తున్న విమర్శలపై ఆపిల్ వాదన వేరే విదంగా ఉంది. కంపెనీ పర్యావరణ లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అందులో భాగంగానే చార్జర్, ఇయర్ ఫోన్స్ ని తొలగించినట్లు తెలిపింది. వీటి తొలగింపు ద్వారా 70 శాతం మేర ప్యాకింగ్ కెపాసిటీ తగ్గి వాటి బదులు ఇతర డివైజ్‌లను ట్రాన్స్‌పోర్ట్ చెయ్యొచ్చని యాపిల్ చెబుతోంది. దీని వల్ల సరఫరా కోసం ఎక్కువ వాహనాలు ఉపయోగించాల్సిన అవసరం ఉండదట. ఇలా వాహన వినియోగం తగ్గించడం ద్వారా ఏటా సుమారు 2 మిలియన్ మెట్రిక్ టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గుతాయని యాపిల్ చెబుతోంది. ఇది సుమారు 4,50,000 కార్లు రోడ్లపై విడుదల చేసే కర్బన ఉద్గారాలకు సమానమట. కానీ కొందరు విమర్శకులు మాత్రం ఇది ఒక మార్కెట్ లో భాగమని తెలిపారు.
కానీ ఏది ఏమైనా ఒకవేల కంపెనీ తీసుకున్న నిర్ణయం పర్యావరణ లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని తీసుకున్నట్లయితే మంచిది. కానీ.. చార్జర్, ఇయర్ ఫోన్స్ మళ్ళీ ఇతర వాహనాల మీద ఆధారపడక తప్పదు ఇది సత్యం.
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.