శుక్రవారం, సెప్టెంబర్ 22, 2023

ప్రపంచపు తొలి 18జీబీ ర్యామ్ స్మార్ట్ ఫోన్ విడుదల!

ప్రస్తుతం మన ఉపయోగించే మొబైల్స్ లో ర్యామ్ సామర్ధ్యం వచ్చేసి 4జీబీ, 6జీబీ వరకు ఉంటుంది. అదే ఫ్లాగ్‌షిప్ మొబైల్స్ లో అయితే 8జీబీ, 12జీబీ ఉంటుంది. ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యధికంగా ర్యామ్ సామర్ధ్యం 12జీబీ మాత్రమే. అంతకు మించి ర్యామ్ సామర్ధ్యం గల స్మార్ట్ ఫోన్ లు మార్కెట్ లోకి అందుబాటులోకి రాలేదు. కానీ, ఇప్పుడు న్యూబియా అనే కంపెనీ టెన్సెంట్ గేమ్స్ తో కలిసి 18జీబీ ర్యామ్‌ గల రెడ్ మ్యాజిక్ 6 ప్రో మొబైల్ ను చైనాలో విడుదల చేసింది.

ఇది ప్రధానంగా గేమింగ్ లవర్స్ ని దృష్టిలో పెట్టుకొని తీసుకొని వచ్చారు. దీనిలో మొబైల్ స్పీడ్, గ్రాఫిక్స్, రిఫ్రెష్ రేట్ ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా బాగున్నాయి. హై ఎండ్ గేమ్స్ ఎక్కువ అడుతున్నప్పుడు కలిగి బ్యాటరీ వేడిని తగ్గించడం కోసం దీనిలో ఒక చిన్న ఫ్యాన్‌ను కూడా అందించారు. బ్యాటరీ వేడిని ఇది 16 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గిస్తుంది. రెడ్ మ్యాజిక్ 6 ప్రో మొబైల్ లో మూడు వేరియంట్ లు ఉన్నాయి. ఇలాంటి ఫోన్ ప్రపంచంలో ఇదే మొదటిది.(ఇది చదవండి: మీ ఆధార్ కార్డును ఎవరు వాడారో తెలుసుకోండిలా..?)

రెడ్‌మ్యాజిక్‌ 6ప్రో ఫీచర్స్:

రెడ్‌మ్యాజిక్‌ 6ప్రోలో 6.8 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోల్డ్(1,080×2,400 పిక్సెల్స్) డిస్‌ప్లే ఉంది. సాధారణ స్మార్ట్‌ఫోన్ల కంటే పెద్ద బెజెల్స్‌ ఉన్నాయి. ఇది 165 హెర్జ్‌ రీఫ్రెష్‌ రేటు ఉన్న ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే కలిగి ఉంది. 500 హెర్జ్‌ టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌, మల్టీ టచ్‌లో 360 హెర్జ్‌‌ ఉంటుంంది. దీనిలో స్నాప్‌డ్రాగన్‌ ఫ్లాగ్‌షిప్‌ ప్రాసెసర్‌ 888ను తీసుకొచ్చారు. ఇది 5జీకి, వైఫై 6ఈకి కూడా సపోర్టు చేస్తుంది. దీనిలో ఎల్‌పీడీడీఆర్‌ 5 ర్యామ్‌, 3.1 యూఎఫ్‌ఎస్‌ స్టోరేజీ అందిస్తున్నారు.

కెమెరాల విషయానికొస్తే వెనుకవైపు 64 ఎంపీ ప్రధాన కెమెరా, 8 ఎంపీ అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌, 2 ఎంపీ మాక్రో కెమెరా అందిస్తున్నారు. ముందు వైపు 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. రెడ్‌ మ్యాజిక్‌ 6 ప్రోలో 4,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇస్తున్నారు. రెడ్‌మ్యాజిక్‌ 6ప్రో 120 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది. దీంతో 17 నిమిషాల్లో బ్యాటరీని ఫుల్‌ చేయొచ్చు. ఈ నెల 11 నుంచి చైనాలో, 16 నుంచి ప్రపంచ మార్కెట్‌లోకి ఈ మొబైల్స్‌ విక్రయానికి రానున్నాయి.

రెడ్ మ్యాజిక్ 6ప్రో ధర:

  • 12జీబీ + 128జీబీ‌ ధర: సుమారు రూ.49,550
  • 12జీబీ + 256జీబీ ధర: సుమారు రూ.54,000
  • 16జీబీ + 256జీబీ ‌ధర: సుమారు రూ.59,600
  • 18జీబీ + 512జీబీ ‌ధర: సుమారు రూ.74,200

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

Telugu