దీపావళి పండుగ అమ్మకాలలో రికార్డు సృష్టించిన షియోమి

0

హైలైట్స్

  • 2020 పండుగ సీజన్ లో అత్యధిక అమ్మకాలను సాధించినట్లు ప్రకటించిన షియోమి
  • పండుగ కాలంలో 13 మిలియన్ పరికరాలను విక్రయించిన షియోమి
  • 2020లో దీపావళి అమ్మకాలలో 9 మిలియన్ ఫోన్‌ల అమ్మకం

2020 స్మార్ట్ ఫోన్ పరిశ్రమకీ కష్టతరమైన సంవత్సరం. కోవిడ్ మహమ్మారి వల్ల లాక్ డౌన్ విధించడంతో పాటు ఇతర కారణాల వల్ల ఫోన్ యొక్క అమ్మకాలు భాగా క్షీణించాయి. ఏదేమైనా, ఈ దీపావళి సీజన్ మాత్రం స్మార్ట్ ఫోన్ తయారీదారులకు కొంత ఊరటని ఇచ్చింది. ఎమ్ఐ ఇండియా ఈ సంవత్సరం పండుగ కాలంలో 13 మిలియన్ పరికరాలను విక్రయించినట్లు ప్రకటించింది. సంస్థ విడుదల చేసిన సమాచారం ప్రకారం, పండుగ అమ్మకాలలో 9 మిలియన్లకు పైగా స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించింది, ఇందులో మి 10 టి ప్రో, రెడ్‌మి నోట్ 9 ప్రో మాక్స్, రెడ్‌మి నోట్ 9 ప్రో, రెడ్‌మి 9 ప్రైమ్ రెడ్‌మి 9, రెడ్‌మి 9ఎ వంటి మోడళ్లు ఉన్నాయి. (చదవండి: లీకైన పోకో ఎమ్3 స్పెసిఫికేషన్స్ ఇవే!)

పండుగ అమ్మకాలలో పర్యావరణ అనుకూల ఉత్పత్తులకు గణనీయమైన డిమాండ్ ఉందని తెలిపింది. టీవీలు, స్ట్రీమింగ్ డివైజ్‌లు, ట్రిమ్మర్లు, స్మార్ట్ బ్యాండ్స్, ఆడియో ఉత్పత్తులు, పవర్ బ్యాంక్స్ తదితర 4 మిలియన్ డివైజ్‌లను విక్రయించినట్టు వివరించింది. బెస్ట్ సెల్లర్ల జాబితాలో ఇటీవలే లాంచ్ చేసిన ఎంఐ వాచ్ రివాల్వ్, ఎంఐ స్మార్ట్ స్పీకర్లు ఉన్నట్టు పేర్కొంది. ఎంఐ బాక్స్ 4కె, ఎంఐ టీవీ స్టిక్‌లకు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో టాప్ సెల్లింగ్ స్ట్రీమింగ్ డివైజ్‌లుగా నిలిచినట్టు తెలిపింది. ఈ సంవత్సరం 4కె టివిల వృద్ధిలో అతిపెద్ద డిమాండ్ ఉందని కంపెనీ వెల్లడించింది. ముఖ్యంగా పెద్ద స్క్రీన్ పరిమాణాలు గల 50/55-అంగుళాల టీవీలకు డిమాండ్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే గత ఏడాదితో పలవిస్తే 50 శాతం వృద్ధిని నమోదు చేశాయి.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here