చైనాకు చెందిన షియోమీ సంస్థ రెడమీ 9 సిరీస్ లో కొత్తగా మరో రెడమీ 9iను తీసుకోస్తూ భారత్ లో నేడు విడుదల చేసింది. రెడ్‌మి 9ఐ ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ మరియు నోచ్డ్ డిస్ప్లే, బిగ్ బ్యాటరీ, సింగిల్ రియర్ కెమెరా మరియు ఆక్టా-కోర్ మీడియాటెక్ ప్రాసెసర్. రెడ్‌మి 9i రెండు ర్యామ్ మరియు స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లు మరియు మూడు విభిన్న రంగులలో మార్కెట్లోకి విడుదల చేసింది.
రెడ్‌మీ 9i ధర(Redmi 9i Price):
రెడ్‌మి 9i ధర రూ. 4 జీబీ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు 8,299 ఉండగా, 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు రూ. 9,299. ఫోన్ మిడ్నైట్ బ్లాక్, సీ బ్లూ మరియు నేచర్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో వస్తుంది. రెడ్‌మి 9i సెప్టెంబర్ 18 నుండి మధ్యాహ్నం 12 గంటలకు (మధ్యాహ్నం) ఫ్లిప్‌కార్ట్, mi.com, మరియు mi home స్టోర్స్ ద్వారా కొనుక్కోవచ్చు. ఈ ఫోన్‌ను షియోమి భాగస్వామి ఆఫ్‌లైన్ రిటైలర్లు కూడా అందిస్తారు.
రెడ్‌మీ 9i స్పెసిఫికేషన్స్:
డిస్‌ప్లే(Display):
ఆండ్రాయిడ్ 10(Q) ఆధారిత రెడ్ మీ MIUI12 ఓఎస్‌తో పనిచేస్తుంది. ఇందులో మనకు వెనుక ఫింగర్ ప్రింట్ సెన్సర్ ను ఉపయోగించారు. 16.58cm (6.53 ఇంచుల) హెచ్ డి + IPS డిస్ప్లే కలిగి ఉంది. కాంట్రాస్ట్ వచ్చేసి 1500:1, అలాగే స్క్రీన్ టూ బాడి రేషియో వచ్చేసి 20:9గా ఉంది. దీని యొక్క బరువు 194 గ్రా.
బ్యాటరీ(Battery):
ఈ ఫోన్‌లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బ్యాటరీ గురించి. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇస్తున్నారు. ఇది 10 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. అంటే ఈ ఫోన్ నుంచి మరో ఫోన్‌ను ఛార్జింగ్ చేసుకోవచ్చన్నమాట. ఇది Micro USB 380v ప్రొటెక్షన్ తో వస్తుంది. 31 గంటల టాక్ టైమ్, 11 గంటల పాటు గేమింగ్ అడుకోవచ్చు, 25.5 గంటలు వీడియోలు చూడవచ్చు, 162 గంటల పాటు పాటలు వినవచ్చు.
ప్రాసెసర్(Processor):
ఇందులోమిడియాటెక్ హీలియో G25 2.0 గిగా హెర్ట్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. గేమింగ్ విషయంలో మనం అంతగా పనితీరు కనబరచక పోవచ్చు. దీని క్లాక్ స్పీడ్ వచ్చేసి 650 మెగా హెర్ట్జ్ గా ఉంది.
స్టోరేజ్(Storage):
ఇది 4GB+64GB, 4GB+128GB స్టోరేజ్ లలో మనకు లభిస్తుంది. ఎక్స్ట్రా మైక్రో ఎస్డీ కార్డ్ ఉపయోగించి మనం స్టోరేజ్ ని 512GB వరకు పెంచు కోవచ్చు. ఇందులో మనకు 2 4G సిమ్ కార్డ్ స్లాట్, ఒక స్టోరేజ్ స్లాట్ ఉంది.
కెమెరా(Camera):
ఇందులో 2 కెమెరాలను ఉపయోగించారు. ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ సెల్ఫీ ఏఐ కెమెరా అమర్చారు. వెనుక వైపు వాడిన ప్రధాన 13 మెగాపిక్సెఎల్ క్వాడ్ కెమెరా ఉపయోగించారు. దీనితో మంచి పోట్రైట్ ఫోటోలను దిగవచ్చు.
ఈ ఫోన్ GPS, AGPS, Glonass, Beidou వంటి నావిగేషన్ కి సపోర్ట్ చేస్తుంది. ఇందులో G,L,P సెన్సార్ లు కూడా ఉపయోగించారు.
Package contents:
Redmi 9i / Power adapter / Micro USB cable / Warranty card / User guide / SIM insertion tool ఉంటాయి.
Thanks