ప్రస్తుత ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ లేదంటే నమ్మశక్యం కాదు. స్మార్ట్ ఫోన్ కి ఎంత క్రేజ్ ఉందో వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ అంతే ప్రాముఖ్యత ఉంది. అందుకనే చాలా సంస్థలు వైర్ లెస్ ఫాస్ట్ ఛార్జర్లను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో షావోమీ ఒక అడుగు ముందుకేసి పవర్ ఫుల్ వైర్ లెస్ ఛార్జర్‌ను సిద్ధం చేసింది. 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ అయినా 20 నిమిషాల్లోపు ఫుల్ ఛార్జి చేయడం దాని ప్రత్యేకత. షావోమీ వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జర్లు తీసుకురావడం కొత్త విషయం కాదు. ఇప్పటికే తీసుకొచ్చిన 50 వాట్ ఫాస్ట్ ఛార్జర్ తో 4,500 ఎంఏహెచ్ బ్యాటరీని కేవలం 40 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ చేసింది. ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన 80 వాట్ వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జర్ తో 4,000 ఎంఏహెచ్ బ్యాటరీని కేవలం 19 నిమిషాల్లో పూర్తి ఛార్జింగ్ చేస్తుంది. భవిష్యత్ లో 100 వాట్ వైర్ లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ తీసుకురాబోతునట్లు సమాచారం. అయితే, అది ఏ సంస్థ నుంచి వస్తుందో తెలీదు. ఇప్పుడు షావోమి ఛార్జర్‌ను చూస్తుంటే 100 వాట్ ఛార్జర్ షావోమి నుంచే వచ్చేలా కనిపిస్తోంది.(చదవండి: ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తు గడువును పొడిగించిన తెలంగాణ ప్రభుత్వం)
Source: Android Authority
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.