యాసంగీ సీజన్ రైతు బంధు నమోదుకు గడువు పెంపు

0

రైతులకు పెట్టుబడి ప్రోత్సాహం కింద తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకమే రైతు బంధు. ఈ పథకం కింద తెలంగాణ రాష్ట్రంలోని దాదాపు 58.33 లక్షల మంది రైతులకు వానాకాలం, యాసంగీ సీజన్ లలో ఎకరాకు 5000 రూపాయల చొప్పున ఎరువులు, విత్తనాలు, ఇతర ఖర్చుల కోసం అందిస్తుంది. రైతులు అప్పు ఉచ్చులో పడకుండా ఉండటానికి అందిస్తుంది. ఈ పథకంలో రైతులు పేరు నమోదు చేసుకోవడానికి ప్రతి ఏడాది రెండుసార్లు అవకాశం ఇచ్చింది. ఇప్పుడు తాజాగా కొత్త పట్టాదారు పాస్‌‌బుక్‌‌లు వచ్చిన వారు రైతుబంధు కోసం నమోదు చేసుకునే చాన్స్ వ్యవసాయశాఖ కల్పించింది.

ఇంకా చదవండి: నేడు నింగీలోకి పీఎస్‌ఎల్‌వీ సీ50

2020 యాసంగీ సీజన్ కి సంబందించిన రైతు బందు డబ్బులు కోసం గైడ్​లైన్స్ రిలీజ్ చేసింది. ఈ నెల 20వ తేదీలోగా మీ దగ్గరలోని ఏఈవోలకు మీ పూర్తి వివరాలు, బాంకు, భూమికి సంబందించిన వివరాలను అందించాలని కోరింది. డిసెంబర్ 10 నాటికి ధరణిలో నమోదైన రైతుల వివరాలు ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులకు చేరాయి. వానకాలంలో రైతు బందుకోసం వివరాలు సమర్పించిన రైతులు మళ్లీ నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు అని పేర్కొంది. ఒకవేళ గతంలో పేరు నమోదు చేసిన డబ్బులు రాకపోతే పట్టాదారు పాస్‌‌బుక్‌‌, ఆధార్ కార్డ్, బ్యాంక్ వివరాలను సరిచూసుకోవలని పేర్కొంది. డిసెంబర్ 27 నుంచి జనవరి 7 వరకు రైతులకు రైతుబంధు సహాయం అందించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. మొదట ఎకరం ఉన్న భూములకు అందనున్నాయి. తర్వాత దశల వారీగా ఇతర రైతులకు డబ్బులు అందజేయనున్నారు.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here