వాట్సాప్ యూజర్లకు షాకింగ్ న్యూస్. మీ మొబైల్ నెంబర్ సహయంతో మీ ఖాతాను హ్యాకర్లు బ్లాక్ చేయడానికి అనుమతించే ఒక భద్రత లోపం ఇటీవల బయపడింది. ఈ లోపంతో మీ ఖాతాను బ్లాక్ చేసి డబ్బులు డిమాండ్ చేసే అవకాశం ఉంది. హ్యాకర్లు మీ వాట్సాప్‌ను పనిచేయకుండా కొద్ది గంటల సేపు తిరిగి యాక్టివేట్ చేయకుండా చేయగలరు. మీరు మీ వాట్సాప్ ఖాతా కోసం టూ-స్టెప్-వెరిఫికేషన్ ఆన్ చేసుకున్న ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉంది.(ఇది చదవండి: సరుకు డెలివరీ కోసం అదిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్)
భద్రతా పరిశోధకులు లూయిస్ మార్క్వెజ్ కార్పింటెరో, ఎర్నెస్టో కెనాల్స్ పెరెనా మొదటిసారిగా వాట్సాప్ ఖాతాను బ్లాక్ చేసే లోపాన్ని కనుగొన్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. వాట్సాప్‌లో మీ ఫోన్ నంబర్‌ను నమోదు చేసిన తర్వాత ఆరు అంకెల సెక్యూరిటీ కోడ్ వస్తుంది. హ్యాకర్ల దగ్గర మీ మొబైల్ లేదు కాబట్టి వారు నాలుగు, ఐదు సార్లు చేయడం వల్ల మీకు 12 గంటలు పాటు సెక్యూరిటీ రాకుండా వాట్సాప్ బ్లాక్ చేస్తుంది. అలాంటి సమయంలో వారు మీ ఫోన్ నంబర్‌ను యాప్ నుంచి బ్లాక్ చేయడానికి వాట్సాప్ సపోర్ట్ తీసుకొంటారు.
దానికోసం వారు ఒక కొత్త ఈ-మెయిల్ ద్వారా ఫోన్ పోయినట్లు వాట్సాప్ కు తెలుపుతారు. ఇలా చేయడం వల్ల మీ వాట్సాప్ ఖాతా బ్లాక్ అవుతుంది. అంటే మీరు ఇకపై మీ ఫోన్‌లో వాట్సాప్ యాప్ యాక్సెస్ చేయలేరు. హ్యాకర్ పంపిన ఈ-మెయిల్ ద్వారా మీ ఖాతా బ్లాక్ చేయబడుతుంది. మీ వాట్సాప్ ఖాతాలో టూ-స్టెప్-వెరిఫికేషన్ ఎనేబల్ చేసుకున్న ఏమి చేయలేరు. హ్యాకర్లు మీ ఖాతాను బ్లాక్ చేయకుండా ఉండటానికి డబ్బులు అడిగే అవకాశం ఉంటుంది. అయితే, మీరు సమస్యను తప్పించుకోవడానికి టూ-స్టెప్-వెరిఫికేషన్ ఆన్ చేసే సమయంలో ఇచ్చిన మెయిల్ ద్వారా తిరిగి మీ ఖాతాను తిరిగి పొందే అవకాశం ఉంటుంది.
మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.