YSR Matsyakara Bharosa: మత్స్యకార కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం తీపికబురు అందించింది. సముద్రంలో చేపల వేట నిషేద సమయంలో జీవనోపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాలకు ఆర్దిక చేయిత ఇచ్చే లక్ష్యంతో తీసుకొచ్చిన వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం కింద ఈ ఏడాది మరింత మందికి లబ్ది లభించనుంది. రాష్ట్రంలో అర్హత కలిగిన 1,19,875 కుటుంబాలకు రూ.10 వేల చొప్పున రూ.119.87 కోట్ల రూపాయలను వారికి అందజేయనున్నారు. (ఇది కూడా చదవండి: క్షిపణుల నుంచి ఇజ్రాయెల్‌ను రక్షిస్తున్న ఉక్కు గొడుగు)
సీఎం వైఎస్ జగన్ తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి కంప్యూటర్ ద్వారా లబ్దిదారుల బ్యాంక్ ఖాతాలలో నేరుగా జమ చేయనున్నారు. గడచిన రెండేళ్ల కాలంలో మత్స్యకారులకు రూ.211.71 కోట్ల మేర లబ్ధి చేకురింది. ఈ ఏడాది మరో కొంత మందికి కలిపి రూ.119.87 కోట్లతో మొత్తం మూడేళ్లలో రూ.331.58 కోట్ల మేర లబ్ధి చేకూర్చినట్లు అవుతుంది. గతంలో రూ.4 వేల చొప్పున ఇచ్చిన భృతి మొత్తాన్ని ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేలకు పెంచింది. గత రెండేళ్లుగా ఏటా క్రమం తప్పకుండా వేట నిషేధ సమయంలోనే భృతిని అందజేస్తూ మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం ఎంతో అండగా నిలుస్తోంది. అలాగే సముద్రంలో వేట కోసం బోట్లపై వెళ్లేందుకు వినియోగించే ఆయిల్‌పై సబ్సిడీ రూపంలో 2019-20లో 10.06 కోట్లు, 2020-21లో రూ.22.70 కోట్లను జగన్ ప్రభుత్వం చెల్లించింది.
మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.