Tuesday, December 3, 2024
HomeTechnologyAndroidజియో నెక్ట్స్‌ ఫోన్ కొంటున్నారా.. అయితే ఈ మొబైల్స్ కూడా చూడండి!

జియో నెక్ట్స్‌ ఫోన్ కొంటున్నారా.. అయితే ఈ మొబైల్స్ కూడా చూడండి!

Jio Phone Next: 2016లో రిలయన్స్ ప్రవేశ పెట్టిన జియో నెట్వర్క్ ఎన్ని సంచాలనాలను క్రియేట్ చేసిందో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి లేదు. ఒకప్పుడు 1జీబీ డేటాను నెల మొత్తం పొదుపుగా వాడుకునే వాళ్లం. అలాంటిది జియో వచ్చాక రోజుకు 1.5జీబీ డేటాను వాడేస్తున్నాము. అంతల మొబైల్ ప్రపంచంలో ఒక విప్లవం క్రియేట్ చేసింది అని చెప్పుకోవాలి.

ఇప్పుడు కూడా మొబైల్ ప్రపంచంలో దీపావళి పండుగా సందర్భంగా నవంబర్ 4న తీసుకొని రాబోతున్న జియో ఫోన్‌ నెక్ట్స్‌ తో మరో సంచలనం క్రియేట్ చేస్తుంది అని అందరూ భావించారు. కానీ, రెండూ రోజుల క్రితం రిలయన్స్ జియో సంస్థ విడుదల చేసిన జియోఫోన్ ఫీచర్స్, ధర చూసి అందరూ షాక్ క్ గురి అయ్యారు.

ఆ ధరకు అందులో ఉన్న ఫీచర్స్ కి ఎటువంటి సంబంధం లేకపోవడంతో ఈ మొబైల్ కొనలనుకునే వారు ట్విటర్ వేదికగా తమ ఆగ్రహాన్ని వెళ్ళబోస్తూన్నారు. ఈ ధరకు ఇంతకంటే మంచి ఫోన్స్ అందుబాటులో ఉన్నాయని తెలుపుతున్నారు. ప్రస్తుతం జియోఫోన్ ధర రూ.6499గా ఉంది. అదే మార్కెట్లో ఉన్న రెడ్​మీ 9ఏ, రియల్‌మీ సీ11లో ఇంతకంటే మంచి ఫీచర్స్ ఉన్నట్లు తెలుపుతున్నారు.

ఇక ఈఎమ్ఐ ఈ రెండూ ఫోన్స్ కంటే ధర ఎక్కువే అవుతుంది. మీరు గనుక జియోఫోన్ నెక్ట్స్ ఫోన్ కొనాలని చూస్తుంటే.. దానికంటే రెడ్​మీ 9ఏ, రియల్‌మీ సీ11లో ఉత్తమ స్పెసిఫికేషన్స్ ఉన్నట్లు మార్కెట్ నిపుణులు తెలుపుతున్నారు. రెడ్​మీ 9ఏ, రియల్‌మీ సీ11, జియోఫోన్ నెక్ట్స్ ఫీచర్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి.

(ఇది కూడా చదవండి: ఒక్కో ఉద్యోగికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన లేడీ బాస్‌!)

జియోఫోన్ నెక్ట్స్రెడ్​మీ 9ఏరియల్‌మీ సీ11
5.45 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లే6.53 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లే6.5 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లే
క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 215 ప్రాసెసర్ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ25 ప్రాసెసర్క్వాడ్ కోర్ మీడియాటెక్ ప్రాసెసర్
2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్
3,500 ఎమ్ఎహెచ్ బ్యాటరీ5,000 ఎమ్ఎహెచ్ బ్యాటరీ5,000 ఎమ్ఎహెచ్ బ్యాటరీ
8 మెగాపిక్సెల్ గెలాక్సీ సెల్ఫీ కెమెరా5 మెగాపిక్సెల్ గెలాక్సీ సెల్ఫీ కెమెరా5 మెగాపిక్సెల్ గెలాక్సీ సెల్ఫీ కెమెరా
13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా8 మెగాపిక్సెల్ రియర్ కెమెరా
ధర – రూ.6,499 ధర – రూ.6,999 ధర – రూ.6,799
- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles