ప్రపంచ వ్యాప్తంగా భాగా గుర్తింపు పొందిన ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్. అందుకే ఈ యాప్ ని ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. వాట్సప్ తమ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ ని తీసుకోస్తూ ఉంటుంది. ఇలా వచిన కొన్ని ఫీచర్స్ మాత్రమే చాలా భాగా పాపులర్ అవుతాయి. వాట్సప్ తీసుకొచ్చిన బెస్ట్ ఫీచర్స్ లలో స్టేటస్ ఫీచర్ ఒకటి. నిత్యం ప్రజలు తమకు నచ్చిన విషయాలను స్టేటస్ లో అప్డేట్ చేస్తూ ఉంటారు. ఇలా అప్డేట్ చేసిన పోస్ట్ అనేది 24 గంటలు మాత్రమే కనిపిస్తుంది. దాని తర్వాత ఆటోమేటిక్ గా డీలిట్ అవుతుంది. ఇలా పోస్ట్ చేసిన పోస్టులను ఎంత మంది చూశారా అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం. వాట్సప్ మెసేజ్ చదివినప్పుడు బ్లూటిక్స్ వచ్చినట్టు, వాట్సప్ స్టేటస్ ఎంతమంది చూశారన్న విషయం తెలుస్తుంది. కానీ మనకు తెలియని ఇంకో విషయం ఏమిటంటే మనకు తెలియకుండానే మన వాట్సప్ స్టేటస్ ని ఇతరులు చూస్తూ ఉంటారు.(చదవండి: ఆపిల్ కంపెనీపై భారీ జరిమానా)
అలా మీరు కూడా మీ మిత్రులు, బందువుల యొక్క స్టేటస్ ని తెలియకుండా చూడలా? అయితే, మీరు దీని కోసం ఎటువంటి ఇతర యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దీని కోసం మీరు మీ వాట్సప్ లోని కొన్ని సెట్టింగ్స్ మార్పులు చేయాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దామా
1) మీరు మీ వాట్సప్ ఓపెన్ చేశాక సెట్టింగ్స్ ఓపెన్ చేయండి.
2) ఇప్పుడు అకౌంట్ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి ప్రైవసీ ని ఎంచుకోండి.
3) మీకు కనిపిస్తున్న రీడ్ రిసిప్ట్స్ ఫీచర్ కనిపిస్తుంది. దాన్ని ఆఫ్ చేస్తే చాలు.
మీరు ఎవరి స్టేటస్ అయినా చెక్ చేస్తే మీరు స్టేటస్ చూసినట్టు తెలియదు. కానీ ఇక్కద ఒక చిన్న ట్విస్ట్ ఉంది. మీరు రీడ్ రిసిప్ట్స్ ఆఫ్ చేస్తే మీ మెసేజ్ అవతలివారు చదివారో లేదో తెలియదు. దీంతో పాటు మీరు అప్‌డేట్ చేసిన స్టేటస్ అవతలివారు చూశారో లేదో కూడా తెలియదు. అయినా పర్లేదు అనుకుంటే ఈ ఫీచర్ ఆఫ్ చేయొచ్చు.
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.