Panasonic Lumix G7 Specifications, Price Details in Telugu: మనలో చాలా బయటికి వెళ్ళినప్పుడో, యూట్యూబ్ వీడియోల కోసమో, వ్లాగింగ్ కోసమో, ఏదైనా శుభ కార్యాలకు వెళ్ళినప్పుడు మనం అక్కడ అందమైన దృశ్యాలను వీడియో తీయడానికో మనకు మంచి వీడియో కెమెరా కావాలని అనుకుంటాం.. కానీ మన దగ్గర కెమెరా లేక పోవడం వలన చాలా నిరుత్సాహ పడతాం.
దీని కోసం కొన్ని కొన్ని సార్లు మన సేవింగ్స్ లోనే, పాకెట్ మనీలోనో కొత్త మొత్తాన్ని కూడా దాచుకుంటాం. ఇంత వరకు భాగానే ఉన్నా మనం మన బడ్జెట్ ధరలో వీడియో కెమెరా ఏది అని వెతుకుతుంటాం. అలాంటి ఒక బడ్జెట్ వీడియో కెమెరా గురుంచి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మనకు కెమెరా అనగానే Canon, Sony, Nikon, Fujifilim, Go-Pro, Panasonic చాలా కంపెనీలు గుర్తుకు వస్తాయి. ఇప్పుడు మనం తెలుసకునేది Panasonic చెందిన Lumix G7 ఇది వీడియో బిగినర్స్ కు చాలా భాగా ఉపయోగ పడుతుంది. దాని యొక్క స్పెసిఫికేషన్స్ ఈ క్రింది విదంగా ఉన్నాయి.
Panasonic Lumix G7 Specifications:
పానాసోనిక్ నుండి వచ్చిన Panasonic Lumix G7 కెమెరాలో 4K రికార్డింగ్ అద్భుతంగా పని చేస్తుంది. చాలా తక్కువ వీడియో కెమెరాలలో ఈ ఆప్షన్ ఉంటుంది. దీని 4K రికార్డింగ్ ద్వారా ప్రొఫెషనల్ కెమెరాకు ధీటుగా వీడియోలు తీయవచ్చు.
ఈ కెమెరా ద్వారా సెకనుకు 120 ఫ్రేమ్‌ల వద్ద 1080p వీడియోను మరియు సెకనుకు 30 ఫ్రేమ్‌ల వరకు 4కె వీడియోను రికార్డ్ చేసుకోవచ్చు. ఇందులో ఆటో ఫోకస్ కూడా చాలా భాగా అనిపించింది. మనం వ్లాగింగ్ కోసం ఈ ఆటో ఫోకస్ చాలా ఉపయోగపడుతుంది.
Panasonic Lumix G7 16 మెగా పిక్సల్ తో వస్తుంది. 46 మెగా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. ట్రైపాడ్ మౌంట్ కూడా ఉంది. మనం లైవ్ ని 4కేలో రికార్డ్ చేయవచ్చు. లైవ్ చేసేటప్పుడు ఫ్రేమ్ క్రాపింగ్ జూమ్ మరియు క్రాపింగ్ ఏరియా చేసుకోవచ్చు. ఇలాంటి ఫీచర్ చాలా తక్కువ బడ్జెట్ ఎస్‌ఎల్‌ఆర్ కెమెరాలలో ఉంటుంది.
ఇది మంచి గ్రిప్ ఉండటమే కాకుండా పాకెట్ కెమెరా కూడా దీనిని మనం చాలా సులభంగా తీసుకొని ఎక్కడికైనా వెళ్ళవచ్చు. మేను సిస్టమ్, బటన్స్ కూడా సింప్లిగా ఒక బిగినర్ లెవల్ వీడియో గ్రాఫర్ కు అర్దమయ్యే రీతిలో ఉంటుంది.
ఇందులో స్టోరేజ్ పూర్తి అయ్యే వరకు ఒకే సారి రికార్డ్ చేయవచ్చు. బ్యాటరీ విషయానికి వస్తే 1200 mAh, 7.2 volts లీథియం అయాన్ బ్యాటరీ ఉంది. ఇకా బడ్జెట్ విషయానికి వస్తే ప్రస్తుతం అమెజాన్(Amazon)లో 39,000కి లభిస్తుంది. అమెజాన్ సేల్స్ లో తక్కువ ధరలో లభిస్తుంది.