మార్కెట్ లో రోజు రోజుకి స్మార్ట్ ఉత్పత్తులకు డిమాండ్ భాగా పెరిగిపోతుంది. వినియోగదారుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ఎలక్ట్రానిక్‌ కంపెనీలు ఎప్పటికప్పుడు ఆకర్షణీయమైన ఫీచర్స్‌తో కొత్త ఉత్పత్తులను తీసుకొస్తున్నాయి. తాజాగా స్మార్ట్ లివింగ్ ఈవెంట్ 2021లో షియోమి కొత్త IoT ఉత్పత్తులను విడుదల చేసింది, వీటిలో చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న మి బ్యాండ్ 5, మి వాచ్ రివాల్వ్ మరియు మి స్మార్ట్ స్పీకర్ ఉన్నాయి. ఈ ఉత్పత్తుల ధర, ఫీచర్ లు, అమ్మకాల తేదీల గురుంచి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఎంఐ స్మార్ట్ స్పీకర్

ఎంఐ స్మార్ట్ స్పీకర్ ను గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ తో తీసుకొచ్చారు. మీరు దానితో మాట్లాడుతున్నప్పుడు దాని పైభాగంలో ఉంగరం లాంటిది మెరుస్తుంది. ఇందులోని 0.7ఎంఎం మెటల్ మెష్ ప్రీమియం లుక్‌ను ఇస్తుంది. దీని పైభాగంలో టచ్ ప్యానెల్‌పై నాలుగు బటన్లు ఉన్నాయి. దీని ద్వారా వచ్చే ధ్వని(Sound) అనేది ఇతర స్మార్ట్ డివైసెస్ కంటే చాలా భాగుంటుంది అని పేర్కొంది. 12 వాట్ 2.5 అంగుళాల ఆడియో డ్రైవర్స్‌ అనేవి మంచి డీటీఎస్‌ సౌండ్ అనుభూతిని ఇస్తాయి. ఇది Wi-Fi మరియు బ్లూటూత్ కనెక్టివిటీని కలిగి ఉంది. స్పీకర్‌ పై భాగంలో మ్యూజిక్‌ కంట్రోల్స్‌తో టచ్‌ ప్యానల్‌ అమర్చారు. వాయిస్‌ కమాండ్స్‌ కోసం రెండు ఫార్-ఫీల్డ్‌ మైక్రోఫోన్స్‌ ఉన్నాయి. అక్టోబరు 1 నుంచి ఫ్లిప్‌కార్ట్‌, ఎంఐ హోమ్ మరియు వెబ్‌సైట్‌లో అమ్మకాలు ప్రారంభంకానున్నాయి. ఇది హిందీ భాషకు కూడా సపోర్ట్ చేస్తుంది. దీని ధర రూ .3999

ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 5

ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 5లో 1.1 అంగుళాల అమోలెడ్ కలర్ ఫుల్‌ టచ్‌ డిస్‌ప్లే ఉంది. దీనిలో ఫిట్‌నెస్‌ ప్రియుల కోసం 11 ప్రొఫెషనల్‌ స్పోర్ట్స్‌ మోడ్స్‌ ఉన్నాయి. సిక్స్‌ యాక్సిస్‌ పీపీజీ హార్ట్‌రేట్ సెన్సర్‌, స్లీప్‌ మానిటరింగ్, ఆరీఈఎం (రాపిడ్ ఐ మూమెంట్), స్ట్రెస్ మానిటరింగ్, బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్‌ గైడ్‌, స్టెప్ కౌంట్, క్యాలరీ కౌంట్‌ వంటి ఫీచర్స్‌ ఉన్నాయి. మహిళల ఆరోగ్యం కోసం ప్రత్యేక ఫీచర్లను ఇస్తున్నారు. 50 మీటర్ల లోతు వరకు నీటిలో పనిచేస్తుంది. 125 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే నార్మల్ మోడ్ లో 14 రోజులు, పవర్‌ సేవింగ్ మోడ్‌లో 21 రోజులు పాటు పనిచేస్తుంది. ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 5 బ్యాండ్‌ 5లో క్యాప్సుల్‌ కింది భాగంలో ఇచ్చిన మ్యాగ్నటిక్‌ పిన్స్‌ ద్వారా బ్యాండ్‌ని డైరెక్ట్‌గా ఛార్జ్‌ చేసుకోవచ్చు. రెండు గంటల్లో పూర్తి బ్యాటరీ ఛార్జ్‌ అవుతుంది. ఇది 5 రంగులలో లభిస్తుంది. అక్టోబరు 1 నుంచి అమెజాన్‌, ఎంఐ వెబ్‌సైట్‌లో అమ్మకాలు ప్రారంభంకానున్నాయి. స్మార్ట్‌బ్యాండ్ ధర రూ. 2,499.

ఎంఐ రివాల్వ్‌ వాచ్‌

ఎంఐ రివాల్వ్ వాచ్ మిడ్నైట్ బ్లాక్ మరియు క్రోమ్ సిల్వర్ అనే రెండు రంగులలో వస్తుంది. ఎంఐ స్మార్ట్‌వాచ్‌లో 1.39 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. దీనికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌ ఉంది. బ్రైట్ నెస్ లెవెల్ అనేది రెడ్‌మి నోట్ 7ప్రోతో సమానం. ఎంఐ వాచ్ రివాల్వ్ ఫస్ట్‌బీట్ మోషన్ అల్గోరిథమ్‌తో వస్తుంది. ఇది స్లీప్ క్వాలిటీ ట్రాకింగ్, స్ట్రెస్‌ మేనేజ్‌మెంట్, హార్ట్‌రేట్ మానిటరింగ్, బాడీ ఎనర్జీ మానిటరింగ్ ను చేస్తుంది. 10 స్పోర్ట్స్‌ మోడ్స్‌, 110 వాచ్‌ ఫేసెస్‌ ఫీచర్స్, వాటర్ రెసిస్టెంట్ ప్రోఫ్ తో‌ ఇస్తున్నారు.420 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. సింగిల్ ఛార్జ్‌తో రెండు వారాలు, జీపీఎస్ ఆన్‌లో ఉంటే 20 గంటల పాటు పనిచేస్తుంది. పూర్తి బ్యాటరీ ఛార్జ్‌ అయ్యేందుకు రెండున్నర గంటల సమయం పడుతుంది.అక్టోబరు 6 నుంచి అమెజాన్‌, ఎంఐ వెబ్‌సైట్‌లలో అమ్మకాలు ప్రారంభంకానున్నాయి. రివాల్వ్‌ వాచ్ ధర రూ. 10,999.

వీటితో పాటు స్మార్ట్‌ ఎల్‌ఈడీ బల్బ్‌, ఆటోమేటిక్‌ సోప్‌ డిస్పెన్సర్‌, అథ్లెటిక్‌ ష్యూర్‌ పేరుతో షూస్‌ను షావోమి విడుదల చేసింది. స్మార్ట్‌ ఎల్‌ఈడీ బల్బ్‌ ధర రూ. 499. మొబైల్‌ యాప్‌ సహాయంతో బల్బ్‌ కాంతిని పెంచడం/తగ్గించడం చేసుకోవచ్చు. ఇందులో వాయిస్‌ అసిస్టెంట్ ఫీచర్ కూడా ఉంది.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని ఇప్పుడే Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here