మీరు బార్ కోడ్ స్కానర్ యాప్ ను ఇంస్టాల్ చేసుకున్నారా? అయితే వెంటనే ఆ అప్లికేషన్ ను మీ ఫోన్ నుంచి తొలగించండి. బార్ కోడ్ స్కానర్ అనే యాప్ ప్రజల స్మార్ట్ ఫోన్లలోకి యాడ్ వేర్ అనే ఒక వైరస్ ను పంపిస్తున్నట్లు తాజాగా ఒక నివేదిక వెల్లడించింది. ఇప్పటికే దీనిని ప్రపంచ వ్యాప్తంగా ఒక కోటికి మందికి పైగా డౌన్ లోడ్ చేసుకున్నారు. కొందరు వినియోగదారులు ఈ మద్య బార్ కోడ్ స్కానర్ యాప్ ఓపెన్ చేసినప్పుడు సంబందం లేని ప్రకటనలు(యాడ్స్), ఇతర బౌజర్లు ఓపెన కావడం వారు గమనించినట్లు పేర్కొన్నారు. (ఇది చదవండి: ఎల్‌పీజీ గ్యాస్ వినియోగదారులకు కేంద్రం భారీ షాక్!)

అలాగే భద్రతా సమస్యల కారణంగా తమ ఫోన్ కు ఒక క్లీనర్ యాప్ ఇన్ స్టాల్ చేయమని అడుగుతున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ సమస్య గూగుల్ దృష్టికి వచ్చిన వెంటనే ఆ యాప్ ను పరిశీలించినప్పుడు అవాంచిత ప్రకటనల కోసం కావాలనే ఈ వైరస్ ను వినియోగదారుల ఫోన్ లలోకి పంపిచ్చినట్లు కనుగొంది. ఈ వైరస్ ద్వారా యూజర్లకు ప్రమాదం అని భావించిన వెంటనే దీనిని గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలిగించింది. అలాగే దీనిని ఇప్పటికే వాడుతున్న వినియోగదారులను ఆన్ ఇంస్టాల్ చేయమని కోరింది. లేకపోతే మీ సమాచారం బహిర్గతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సూచించింది. ఈ బార్ కోడ్ స్కానర్ యాప్ ను లావాబర్డ్ లిమిటెడ్ అనే సంస్థ అభివృద్ది చేసింది. గత ఏడాది ఆగష్టులో తీసుకొచ్చిన అప్డేట్ లో భాగంగా ఈ వైరస్ యాప్ లోకి ప్రవేశించినట్లు కనుగొన్నారు.
మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.