మనం ఎన్నో రోజుల నుండి ఎదురుచూస్తున్నా ఇండియన్ స్మార్ట్ ఫోన్ కంపెనీ అయిన మైక్రోమాక్స్ తన రెండు కొత్త ఫోన్‌లను మార్కెట్ లోకి విడుదల చేసింది. ఒకప్పుడు ఇండియన్ మొబైల్ మార్కెట్‌లో గట్టి పోటీ ఇచ్చిన మైక్రోమ్యాక్స్ ఆ తర్వాత రాణించలేకపోయింది. శాంసంగ్, షావోమీ, రియల్‌మీ, ఒప్పో, వివో లాంటి కంపెనీల పోటీని తట్టుకోలేకపోయింది. ఇప్పుడు మరోసారి మైక్రోమ్యాక్స్ ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో రెండు స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేసి షావోమీ, రియల్‌మీ, సాంసంగ్ కంపెనీలకు సవాల్ విసురుతోంది. గాల్వాన్ ఘటన తర్వాత దేశం మొత్తం యాంటీ చైనా సెంటిమెంట్ దేశమంతా నెలకొన్న సంగతి తెలిసిందే.
అయితే, ఇప్పుడు మొబైలు రంగంలో చైనా యొక్క ఆధిపత్యాన్ని ఢీకొట్టేందుకు మైక్రోమ్యాక్స్ మేడ్ ఇన్ ఇండియా ట్యాగ్‌తో రంగంలోకి దిగుతోంది. మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 1, మైక్రోమ్యాక్స్ ఇన్ 1బీ మొబైలు మోడల్స్ ని నేడు పరిచయం చేసింది. ఒకటి ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ కాగా, మరొకటి మిడ్ రేంజ్ లెవెల్ స్మార్ట్ ఫోన్. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు మైక్రోమ్యాక్స్ అధికారిక స్టోర్‌లో నవంబర్ 26న సేల్ మొదలవుతుంది. మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 1 ప్రారంభ ధర రూ.10,999 కాగా, మైక్రోమ్యాక్స్ ఇన్ 1బీ ప్రారంభ ధర రూ.6,999.
ఈ రెండు స్మార్ట్‌ఫోన్ల ఫీచర్స్ చూస్తే ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న బడా బ్రాండ్స్ మోడల్స్‌కు గట్టిపోటీ ఇచ్చేలా ఉన్నాయి. ఇవి స్టాక్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లు. అంటే ఇందులో గూగుల్ యాప్స్ తప్ప ఇతర యాప్స్ ఏవీ ఉండవు. రెండేళ్ల పాటు రెగ్యులర్‌గా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ లభిస్తాయి.
మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 స్పెసిఫికేషన్స్
Display: | 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ |
RAM: | 4జీబీ ఇంటర్నల్ |
Storage: | 64జీబీ, 128జీబీ |
Processor: | మీడియాటెక్ హీలియో జీ85 |
Back Camera: | 48+5+2+2 మెగాపిక్సెల్ |
Front Camera: | 16 మెగాపిక్సెల్ |
Battery: | 5,000ఎంఏహెచ్ (18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్) |
Operating System: | ఆండ్రాయిడ్ 10 |
SIM Support: | డ్యూయెల్ సిమ్ |
Colors: | గ్రీన్, వైట్ |
Price: | 4జీబీ+64జీబీ – రూ.10,999 4జీబీ+128జీబీ – రూ.12,499 |
మైక్రోమాక్స్ ఇన్ 1బీ స్పెసిఫికేషన్స్
Display: | 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ |
RAM: | 2జీబీ, 4జీబీ |
Storage: | 32జీబీ, 64జీబీ |
Processor: | మీడియాటెక్ హీలియో జీ35 |
Back Camera: | 13 మెగాపిక్సెల్ |
Front Camera: | 8 మెగాపిక్సెల్ |
Battery: | 5,000ఎంఏహెచ్ (10వాట్ ఫాస్ట్ ఛార్జింగ్) |
Operating System: | ఆండ్రాయిడ్ 10 |
SIM Support: | డ్యూయెల్ సిమ్ |
Colors: | బ్ల్యూ , పర్పుల్, గ్రీన్ |
Price: | 2జీబీ+32జీబీ- రూ.6,999 4జీబీ+64జీబీ- రూ.7,999 |
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.