మైక్రోమాక్స్ భారతదేశంలో తిరిగి రావాలని చూస్తోంది. మైక్రో మాక్స్ సంస్థ త్వరలోనే బడ్జెట్ లో ‘ఐఎన్(in) ‘ అనే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతున్నట్లు సహ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మ వీడియోను షేర్ చేశారు. ఈ ఫోన్‌ను భారతదేశంలో తయారు చేస్తామని, దిగుమతి చేసుకోలేదని ఆయన అన్నారు.

గతంలో మైక్రోమాక్స్ మరియు ఇతర స్వదేశీ బ్రాండ్లైన కార్బన్ మరియు లావా ఒక సమయంలో భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందాయి ఈ బ్రాండ్లు. ఎప్పుడైతే షియోమి , వివో, ఒప్పో మరియు మరిన్ని కంపెనీలు హై-ఎండ్ ఫీచర్లతో సరసమైన ధరలకు అందజేయడం మొదలు చేశాయో అప్పటి నుండి మైక్రోమాక్స్ మరియు ఇతర భారతీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లు క్రమ క్రమంగా కనుమరగు అయిపోయాయి. ఇప్పడు మళ్ళీ ప్రధాని మోడీ పిలుపునిచ్చిన ఆత్మనిర్భర్ పిలుపు మేరకు ఆకర్షణీయమైన ఫీచర్స్ తో ఈ ఫోన్ ని తీసుకువస్తునట్లు తెలిపారు. దీని ధర వచ్చేసి 7,000 నుండి 15,000 వరకు మద్య ఉండవచ్చని సమాచారం. ది మొబైల్ ఇండియన్ తెలిపిన సమాచారం ప్రకారం, మైక్రోమాక్స్ తన ‘IN’ సిరీస్ కింద నవంబర్ 2 నాటికి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయబోతోంది.(చదవండి: ఈ టిప్స్ ద్వారా మీ వాట్సప్ స్టోరేజ్ సమస్యకు చెక్ పెట్టండి ఇలా?)

Expected ఫీచర్స్:

ఫోన్ లో 6.5-అంగుళాల HD + డిస్ప్లే తో కూడిన మీడియా టెక్ G35 చిప్సెట్ తో రావొచ్చు. ఇది 3 జిబి ర్యామ్ మరియు 2 జిబి ర్యామ్ వేరియంట్లలో 32 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుందని సమాచారం.  అంతేకాకుండా, ఫోన్‌లో 5,000 mAh శక్తివంతమైన బ్యాటరీ వస్తుంది. కెమెరా విషయానికి వస్తే, 2 జీబీ వేరియంట్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో 13 ఎంపీ, 2 ఎంపీ కెమెరాలతో పాటు 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ముందు భాగంలో వస్తాయని సమాచారం.  మరోవైపు, 3 జిబి వేరియంట్లో 13 ఎంపి ప్రైమరీ కెమెరా, 5 ఎంపి సెకండరీ కెమెరా మరియు 2 ఎంపి సెన్సార్లతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో జతచేయ బడుతుంది.  అంతేకాకుండా, ఈ వేరియంట్ లో ముందు భాగంలో 13MP సెల్ఫీ కెమెరాను తీసుకురానుంది. ఈ రెండు ‘ఇన్-సిరీస్’ స్మార్ట్ ఫోన్ లు స్టాక్ androidతో వస్తాయని సమాచారం. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here