WhatsApp Mute Video: ఈ ఏడాది ప్రారంభంలో కొత్త ప్రైవసీ పాలసీ నిబందనలు తీసుకొచ్చిన వాట్సాప్, తర్వాత వ్యతిరేకతను మూట గట్టుకుంది. అయితే, తిరిగి తన యూజర్లను ఆకట్టుకోవడం కోసం సరికొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొని వస్తుంది. తాజాగా, వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటి వరకు స్టేటస్ లో ఏదైనా వీడియోను షేర్ చేసేటప్పుడు దాని వీడియో వాయిస్‌ను మ్యూట్ చేసే అవకాశం ఉండేది కాదు. వీడియోలో అభ్యంతర కరమైన వ్యాఖ్యలు, అసహ్యమైన మాటలు ఉంటే ఇతరులు చాలా ఇబ్బంది పడేవారు. ఇప్పుడు తీసుకొచ్చిన ఈ కొత్త వెర్షన్‌లో మ్యూట్ వీడియో సౌకర్యాన్ని వాట్సాప్ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది.(ఇది చదవండి: మళ్లీ పెరిగిన ఎల్పీజీ వంట గ్యాస్ ధరలు)

దీని వల్ల అనవసరమైన ఆడియోను తీసేసి సంబంధిత వీడియోను మాత్రమే పంపుకునే అవకాశం ఉంటుంది. వాట్సాప్ తీసుకొచ్చిన ఈ ఫీచర్‌ను చాలా సులువుగా ఉపయోగించవచ్చు. మీరు స్టేటస్ లో షేర్ చేయాలనీ అనుకున్న వీడియోను ఎంచుకొన్నపుడు దానికింద సౌండ్ సింబల్ కనిపిస్తుంది. దానిని సింపుల్‌గా క్లిక్ చేసి మ్యూట్ చేసేస్తే సరిపోతుంది. దానివల్ల అవతలి వ్యక్తికి ఎలాంటి ఆడియో లేకుండా వీడియో ప్లే అవుతుంది. ఇప్పటికే కొంతమంది వాట్సాప్ యూజర్లకు ఈ కొత్త అప్డేట్ వచ్చింది. మీకు కనుక ఈ ఫీచర్ రాకపోతే ఒకసారి మీ వాట్సాప్ అప్డేట్ చేసుకోండి. అలాగే, కొత్తగా తీసుకురానున్న ప్రైవసీ పాలసీపై కూడా వాట్సాప్ బృందం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.