టిక్ టాక్ లవర్స్ కి శుభవార్త తెలిపింది బైట్‌డాన్స్ సంస్థ. భారత్‌లో నిషేధానికి గురైన పబ్‌జీ మళ్లీ దేశంలోకి రాబోతోంది. అలానే ప్రముఖ వీడియో యాప్‌ టిక్‌టాక్ కూడా త్వరలో అడుగు పెట్టేందుకు సమాయత్తవుతోంది. త్వరలో తిరిగి భారత్ లో దీర్ఘకాలిక ప్రణాళికలతో రాబోతున్నట్లు ఈ మేరకు సంస్థ ఉద్యోగులకు టిక్‌టాక్‌ ఇండియా హెడ్‌ నిఖిల్‌ గాంధీ లేఖ రాసారు. యూజర్ల డేటా గోప్యత మరియు భద్రత కోసం స్థానిక చట్టాలను పాటించటానికి బైట్‌డాన్స్ యాజమాన్యంలోని టిక్ టాక్ యాప్ కట్టుబడి ఉందని లేఖలో గాంధీ పేర్కొన్నారు. గాంధీ “భారతదేశంలో టిక్‌టాక్‌కు అపారమైన వృద్ధి అవకాశం ఉన్నట్లు” చెప్పాడు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తుందన్న నమ్మకం ఉందని లేఖలో పేర్కొన్నారు. భారత దేశంలో బైట్‌డాన్స్‌లో 2 వేలకు పైగా ఉద్యోగులు ఉన్నారు.

“టిక్ ‌టాక్ యాప్‌కు సంబంధించి వివరణలు అన్నీ ప్రభుత్వానికి సమర్పించాం. వారికి ఏవైనా సమస్యలుంటే పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మన ప్లాట్‌ఫామ్‌తో గుర్తింపునే కాకుండా జీవనోపాధికి కొత్త మార్గాలను అన్వేషించిన వినియోగదారులు, క్రియేటర్స్‌ కోసం ఉద్యోగులందరం అంకిత భావంతో పని చేస్తాం’’ అని టిక్‌టాక్‌ ఇండియా హెడ్‌ నిఖిల్‌ గాంధీ వెల్లడించారు. టిక్‌టాక్‌తో సహా చైనాకు చెందిన వుయ్‌ చాట్‌, యూసీ బ్రౌజర్‌, పబ్‌జీ ఇంకా 117 యాప్‌లపై కేంద్రం నిషేధం విధించిన విషయం తెలిసిందే.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here