వాట్సాప్ కొద్ది రోజుల క్రితం కొత్తగా ప్రైవసీ పాలసీ నిబందనలను తీసుకొచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ న్యూస్ కూడా గూగుల్ సర్చ్ లో, సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది. ఇంతకు అందులో ఏముంది అంటే? మేము కొత్తగా 2021లో తీసుకొచ్చిన ప్రైవసీ పాలసీ నిబందనలను అంగీకరిచాల్సిందిగా యూజర్లను కోరుతున్నాం. ఒకవేల ఎవరైతే తమ కొత్త నిబందనలను అంగీకరించరో వారి మొబైల్ ఫోన్లలో తమ వాట్సాప్ సేవలు 2021 ఫిబ్రవరి 8 నుంచి నిలిపివేయనున్నట్లు ప్రకటించింది.
ఇంకా చదవండి: వాట్సప్ కొత్త ప్రైవసీ పాలసీలో అసలు ఏముంది..?
టెలిగ్రామ్, సిగ్నల్ వైపు యూజర్ల చూపు.. ?
ఈ కొత్త ప్రైవసీ పాలసీ ప్రకారం ఫేస్‌బుక్ సంబంధిత సర్వీసులతో వినియోగదారుల డేటాను పంచుకోవడమమనేది ముఖ్యమైన సారాంశం. యూజర్ వ్యక్తిగత సమాచారం, డివైజ్ ఇన్ఫర్మేషన్, ఐపీ అడ్రస్ తదితర వివరాలు ఫేస్‌బుక్‌తో వాట్సాప్ పంచుకొనున్నట్లు సంస్థ పేర్కొంది. తమ ప్రైవసీకి భంగం వాటిల్లుతున్న నేపథ్యంలో యూజర్లు టెలిగ్రామ్, సిగ్నల్ మెసెంజర్ వంటి ఇతర యాప్ ల వైపు చూస్తున్నారు. గతంలో కంటే వాట్సాప్ కొత్త నిబందనలను తీసుకొచ్చిన తర్వాత వీటి డౌన్లోడ్ సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అలాగే టెలిగ్రామ్, సిగ్నల్ యాప్స్ వాట్సాప్ ప్రైవసీ కంటే చాలా మెరుగ్గా ఉండటంతో పాటు ప్లే స్టోర్ నుండి ఉచితంగా లభిస్తున్నాయి. దీంతో వాటి వైపు యూజర్లు మొగ్గుచూపుతున్నారు.
ప్రస్తుతం మార్కెట్ లో వాట్సాప్ కు పోటీగా టెలిగ్రామ్ యాప్ ఎప్పటినుండో ఉంది. ఇది వాట్సాప్ తో ప్రైవసీతో పోలిస్తే చాలా కట్టుదిట్టంగా ఉండటంతో పాటు స్థానిక అవసరాలకు తగ్గట్టుగా దీనిని రూపొందించారు. ఇతర యాప్స్ తో ఇది ప్రైవసీ చాలా ఉత్తమంగా ఉంటుంది. దీనిలో ఒకే గ్రూప్ లో లక్షల మందిని యాడ్ చేసుకొనే అవకాశం ఉంది. ఇప్పటి వరకు వాట్సాప్ అందించే ఎండ్ టూ ఎండ్ ఎన్ క్రిప్షన్ టెలిగ్రామ్ అందింస్తుంది. టెలిగ్రామ్ సీక్రెట్ చాట్ అనే ఆప్షన్ ను సైతం అందిస్తుంది. టెలిగ్రామ్ లో 1.5జీబీ పరిమాణం గల ఏ ఏ విధమైనా ఫైల్ అయినా మనం పంపించుకోవచ్చు. ఇతర అనేక ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.
అలాగే సిగ్నల్ యాప్ కూడా ప్రైవసీ సెక్యూరిటీ పరంగా చాలా ఉత్తమమైనది. ప్రస్తుత ప్రపంచ కుబేరుడు టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ తన ట్విటర్ ఖాతాలో ‘యూజ్ సిగ్నల్’ (సిగ్నల్‌ను ఉపయోగించండి) అని ట్వీట్ చేశారు. దీంతో వాట్సాప్ వినియోగదారులు అటువైపు కూడా చూస్తున్నారు. దీంతో ఒక్కసారిగా యాప్ రిజిస్ట్రేషన్లు పెరగడంతో సిగ్నల్ యాప్ లో సాంకేతిక లోపం ఏర్పడింది అంటే మనం అర్ధం చేసుకోవచ్చు. దానిని ఎంత మంది కొత్తగా వినియోగిస్తున్నారు అనేది.
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్(YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.