వెబ్/డెస్క్‌టాప్ క్లయింట్ కోసం వాట్సాప్ కొత్త వెర్షన్‌ను విడుదల చేసింది, తాజాగా వెర్షన్‌ను 2.2043.7 తీసుకువచ్చింది. ఈ అప్డేట్ లో ఏమి ఉంది? మరింత తెలుసుకోవడానికి ఈ కథనాన్ని చదవండి!

ఇన్‌స్టాంట్ మెసేజింగ్ యాప్‌ వాట్సప్ ఎప్పటికపుడు కొత్త ఫీచర్స్ తీసుకోస్తూ తన వినియోగదారులను ఆకట్టుకుంటుంది. మొబైల్ వెర్షన్ కి పరిమితమైన వీడియో/ వాయిస్ కాల్ ఫీచర్ ని తాజాగా వాట్సాప్‌ డెస్క్‌టాప్‌ వెర్షన్ లో కూడా తీసుకొస్తునట్లు తెలిపింది. ప్రస్తుతం ఇది బీటా వెర్షన్‌ యూజర్స్‌కి మాత్రమే ఈ ఫీచర్‌ అందుబాటులో ఉంది. త్వరలో వాట్సప్ వినియోగదారులందరికి తీసుకొస్తామని వాట్సాప్‌ కమ్యూనిటీ బ్లాగ్‌ వాట్సాప్ బీటా ఇన్ఫో (వాబీటాఇన్ఫో) తెలిపింది. వాట్సాప్‌ కొత్త అప్‌డేట్ 2.2043.7 వెర్షన్ కి సంబంధించిన స్క్రీన్‌ షాట్స్‌ను షేర్ చేసింది.

కొత్తగా డెస్క్‌టాప్‌ వెర్షన్‌లో వీడియో కాల్ వచ్చినప్పుడు ప్రత్యేక విండోలో కాల్ ఆక్సెప్ట్/ రిజెక్ట్ చేసే ఆప్షన్ ని చూపిస్తుంది.అలానే ఇతరులకు మనం కాల్ చేసినప్పడు కాల్‌ స్టేటస్‌ చూపిస్తూ పాప్‌-అప్‌ విండో ఓపెన్ అవుతుంది.దీని వల్ల వాట్సాప్‌ డెస్క్‌టాప్‌ వెర్షన్ ఎక్కువగా ఉపయోగించే యూజర్స్‌ వాయిస్‌/వీడియో కాల్స్‌ కోసం మొబైల్‌ ఉపయోగించాల్సిన అవసరం ఉండదు.ఈ కొత్త ఫీచర్ అనేది గ్రూప్ వీడియో కాల్స్ కూడా సపోర్ట్ చేస్తుంది.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.