Google People Card: మనలో చాలా మంది మీరు ఏమి చేస్తున్నారు అని అడిగితే నేను పాలన అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను అని చెప్పుతాము. కానీ అదే ఇంటర్నెట్ సమాజానికి వస్తే చాలా సింపుల్ గా వారి బయో డేటాను(Facebook, Twitter, Instagram)లో లాగా క్రియేట్ చేస్తారు.
కానీ ఈ ప్రస్తుతం సమాజంలో బిజినెస్ ప్రొఫైల్స్ అనుసరించే వారు చాలా తక్కువ మందే ఉంటారు. సాదారణంగా అయితే మనం మన బిజినెస్ కోసం కార్డులు తయారు చేసి వాటిని ఇతరులకు ఇస్తాం. కానీ, ప్రస్తుత కాలంలో ఒకరిని ఒకరు కలవడం చాలా తక్కువ అయిపోయింది. అందుకనే మనం మన కార్డులను ఇచ్చే అవకాశాలు కూడా చాలా తగ్గిపోయాయి అని చెప్పవచ్చు.
కానీ మనం ఇప్పుడు నిరుత్సాహ పడవాల్సిన అవసరం లేదు. మన అవసరాన్ని గుర్తించిన గూగుల్(Google) Add Me to Search లేదా Google People Card పేరుతో వర్చువల్ బిజినెస్ కార్డులను తీసుకొచ్చింది. ఈ సౌకర్యం బిజినెస్ వారికి మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరి కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ Google People Cardలో విద్యార్దులు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలు ప్రతి ఒక్కరూ వివరాలను పూర్తి చేసి ఆ కార్డును మన ఫ్రెండ్స్, బందువులు, వినియోగదారులకు షేర్ చేసుకోవచ్చు.
గూగుల్ పీపుల్ కార్డ్ ఎలా చేసుకోవాలి?
గూగుల్ లో “Add me to Search” అని సెర్చ్ చేసి మీరు మీ సొంత పీపుల్ కార్డును క్రియేట్ చేసుకోవచ్చు.మీరు అలా సెర్చ్ చేయడానికి ముందు, మీరు జోడించదలిచిన సమాచారాన్ని కలిగి ఉన్న గూగుల్ ఖాతాలోకి సైన్ ఇన్ (Gmail sign-in) అయ్యారని నిర్ధారించుకోండి. అంటే, ఈ బిజినెస్ కార్డ్ ను క్రియేట్ చేయడానికి మీరు మీ మొబైల్ లో మీ యొక్క గూగుల్ అకౌంటును లాగిన్ చేసి ఉండాలి.
మీ మొబైల్ ద్వారా Google Searchలో “Add Me to Search” ఎంటర్ చేశాక మీకు కింద “Add Yourself to Google Search” అని వస్తుంది. దాని కింద Get Started అనే బటన్ ను క్లిక్ చేసి. ఈ క్రింది వివరాలను పూర్తి చేయండి.
• మీ ఫోటో(Photo)
• పేరు(Name)
• మీ గురుంచి(About)
• వృత్తి(Occupation)
• పనిచేసే కంపెనీ(Work)
• చదువు(Education)
• స్వస్థలం(Home Town)
• వెబ్ సైట్(Website)
• ఫోన్ నెంబర్(Phone)
• ఈ-మెయిల్(E-Mail)
• సామాజిక ప్రొఫైల్స్(Social Profiles)
తాజా టెక్నాలజీ మరియు ప్రభుత్వ సేవల వార్తల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్స్టాగ్రామ్(Instagram) మరియు యూట్యూబ్(YouTube) ఛానెల్, షేర్ చాట్(Share Chat) వంటి సామాజిక మాద్యమలను అనుసరించండి.