Jio Bharat 4G Phone Price: ప్రముఖ టెలికం సంస్థ జియో తాజాగా ఇంటర్నెట్ ఆధారిత చౌక జియో భారత్ 4జీ ఫోన్ను ఆవిష్కరించింది. దీని ధర రూ. 999లుగా పేర్కొంది. ఈ మొబైల్ కొన్నవారికి మరో ప్రత్యేక ఆఫర్ అందిస్తున్నట్లు తెలిపింది. ఈ మొబైల్ కనీస నెలవారీ రీచార్జి రూ. 129 అని తెలిపింది. ఈ ప్లాన్’లో భాగంగా అపరిమిత వాయిస్ కాల్స్, 14 జీబీ డేటా లభిస్తుంది.
జూలై 7 నుంచి 10 లక్షల పైచిలుకు జియో భారత్ ఫోన్ల ప్రయోగాత్మక ట్రయల్స్ ప్రారంభమవుతాయని జియో ఒక ప్రకటనలో పేర్కొంది. ఇతర ఆపరేటర్లు అందిస్తున్న ఫీచర్ ఫోన్ నెలవారీ ష్లాన్లతో పోలిస్తే 80 శాతం చౌకగా, రెట్లు ఎక్కువ డేటాను యూజర్లు పొందవచ్చని సంస్థ తెలిపింది పేర్కొంది. 2జీ విముక్త భారత్ లక్ష్య సాధనను వేగవంతం చేసే దిశగా జియో ఈ మొబైల్స్‌ను ప్రవేశపెట్టింది.
(ఇది కూడా చదవండి: Gold: పాన్/ఆధార్ లేకుండా ఎంత డబ్బుతో బంగారం కొనొచ్చు?)
ప్రస్తుతం దేశంలో 25 కోట్ల పైచిలుకు 2జీ ఫీచర్ ఫోన్లను వాడుతున్నారని అంచనా. ఒకవైపు ప్రపంచం 5జీ విప్లవం ముంగిట నిల్చుండగా… 25 కోట్ల మంది ఇంకా 2జీ వాడుతున్నారని, ప్రాథమిక ఇంటర్నెట్ ప్రయోజనాలను కూడా పొందడం లేదని రిలయన్స్ జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ తెలిపారు. డిజిటల్ యుగంలో టెక్నాలజీ ప్రయోజనాలు ఏ కొందరికో పరిమితం కాకుండా ప్రతి ఒక్కరికీ అందలని జియో భారత్ ఫోన్ లాంచ్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
జియో భారత్ 4జీ ఫోన్ ఫీచర్స్:
- ఇది రెండు రంగుల్లో లభిస్తుంది.
- ఇందులో 1.77 అంగుళాల క్యూవీజీఏ డిస్‌ప్లే ఉంటుంది.
- ఇది 1000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోంది, జియో సిమ్ లాకై ఉంటుంది.
- ఇందులో జియో సినిమా, జియో సావన్ వంటి ఎంటర్‌టైన్‌మెంట్ యాప్స్ ప్రీ ఇన్‌స్టాల్డ్‌గా వస్తాయి.
- యూపీఐ పేమెంట్స్ చేసేందుకు వీలుగా జియో పే యాప్‌ను అందిస్తున్నారు.
- టార్చ్, ఎఫ్‌ఎం రేడియో, 3.5 ఎంఎం జాక్, 0.3 ఎంపీ కెమెరా వంటివి అందిస్తున్నారు.
- డివైజ్ స్టోరేజీని ఎస్‌డీ కార్డు ద్వారా 128 జీబీ వరకు పెంచుకునే సదుపాయం ఉంది.
- దగ్గర్లోని రిటైల్ స్టోర్లలో ఈ ఫోన్ లభిస్తుందని జియో తెలిపింది.