మీరు ఎల్‌జీ స్మార్ట్‌ఫోన్‌ ప్రీయులా? అయితే మీకో చేదు వార్తా‌. దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్‌జి ఎలక్ట్రానిక్స్ తన మొబైల్ కమ్యూనికేషన్ వ్యాపారాన్ని పూర్తిగా నిలిపివేయాలని కంపెనీ యోచిస్తుంది. స్మార్ట్‌ఫోన్‌ విక్రయాల విషయంలో ఇతర కంపెనీలతో పోలిస్తే వెనుకబడి పోవడం వల్ల తన మొబైల్ సామ్రాజ్యానికి స్వస్తి పలకడానికి ప్రధాన కారణంగా తెలుస్తుంది.

దక్షిణ కొరియాకు చెందిన డోంగా ఇల్బో నివేదిక ప్రకారం.. స్మార్ట్ ఫోన్ల అమ్మకాల విషయంలో జర్మనీకి చెందిన వోక్స్‌వ్యాగన్ ఏజీ, వియత్నాంకు చెందిన వింగ్రూప్ జేఎస్‌సి అనే రెండు సంస్థలతో ఎల్జీ చర్చలు జరిపింది. ఈ చర్చలు సఫలం కాకపోవడంతో మొత్తం మొబైల్ కమ్యూనికేషన్ వ్యాపారాన్నే నిలిపివేయాలని ఎల్‌జీ నిర్ణయించుకుంది. ఈ ఏడాది మొదటి అర్ధభాగంలో లాంచ్ కాబోయే కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచింగ్‌ లను ఎల్‌జీ నిలిపివేసింది. ఎల్ జీ పాపులర్ స్మార్ట్‌ఫోన్ రోలబుల్ డిస్‌ప్లే గల ఫోన్ల ఉత్పత్తిని గత నెలలో నిలిపివేసింది.

‘ది రోలబుల్’ గా పిలువబడే ఈ ఫోన్‌ను ఎల్‌జీ తిరిగి సీఈఎస్‌ 2021లో ప్రదర్శించింది. స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు నిలిపివేసి, ఆ వ్యాపారం నుంచి పూర్తిగా వైదొలిగే వైపు ఆలోచన చేస్తోందని కొరియా చెందిన ప్రముఖ పత్రిక జనవరిలోనే తెలిపింది. గత ఐదు ఏళ్లలో కంపెనీ 4.5 బిలియన్ల డాలర్లు(రూ.32,856 కోట్లు) నష్ట పోయినట్లు ఉద్యోగులకు రాసిన లేఖలో కంపెనీ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే మొబైల్ కమ్యూనికేషన్స్‌ని విడిచిపెట్టాలని నిర్ణయించినట్లు బాంగ్ తెలిపారు.

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here