మీరు స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే వెంటనే కొనుగోలు చేయడం మేలు. త్వరలో యాపిల్, శాంసంగ్, ఒప్పో, షియోమీ, వివో యొక్క ధరలు పెరగవచ్చు. మొబైల్ డిస్ప్లే మరియు టచ్ ప్యానెళ్లపై కేంద్ర ప్రభుత్వం 10% దిగుమతి సుంకాన్ని విధించింది, ఈ సుంకాన్ని తయారీదారులు వినియోగదారుల నుండి వసూలు చేయనున్నారు. ఆత్మ నిర్భర్ భారత్ ప్రచారం కింద స్థానిక తయారీని ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఇతర దేశల వస్తువులపై అదనపు సెస్ ను విధించింది కేంద్రం. ఈ కారణంగా దిగుమతిదారులపై అన్నీ సుంకాలు కలుపుకుంటే దిగుమతిదారులపై 11% శాతం వరకు భారం పడనుంది. ఏదేమైనా ఈ సుంకాల పెంపుతో సెల్‌ఫోన్‌ల ధరల పెరుగుదల 2 – 5% వరకు ఉండవచ్చు. ఇంకోవైపు స్మార్ట్ ఫోన్ ధరల పెరగుదలతో ఈ పండుగ సీజన్ ని దెబ్బతీనే అవకాశం ఉంది.(చదవండి: గూగుల్ సాయంతో పోయిన మొబైల్ ఫోన్ ని కనిపెట్టడం ఎలా..?)

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని ఇప్పుడే Subscribe చేసుకోండి.