COVID-19 కారణంగా విధించిన లాక్ డౌన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ తో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశ్రమలను ప్రభావితం చేసింది. ఈ మద్య ప్రభుత్వం లాక్ డౌన్ నిబందనలను సడలించడంతో, మునుపటి త్రైమాసికాలతో పోలిస్తే పరిస్థితి ఇప్పుడు కొంచెం మెరుగుపడింది. కెనాలిస్ తెలిపిన తాజా నివేదన ప్రకారం, భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ కోలుకుంటుంది మరియు 2020 మూడవ త్రైమాసికంలో దేశంలో స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు 8 శాతం వృద్ధిని నమోదు చేసి అమ్మకాలు 50 మిలియన్ (5 కోట్లు) యూనిట్లకు చేరుకున్నాయి.

తాజా నివేదిక ప్రకారం, 2020 మూడవ త్రైమాసికం స్మార్ట్ ఫోన్ అమ్మకాలలో షియోమి అగ్రస్థానంలో నిలిచింది, 3వ త్రైమాసికంలో మొబైల్ అమ్మకాలలో 9 శాతం వృద్దిని నమోదు చేసి 13.1 మిలియన్ యూనిట్లను రవాణా చేసింది. అలాగే శామ్సంగ్ సంస్థ 1.2 కోట్ల యూనిట్ల అమ్మకాలతో 7 శాతం వృద్ధితో రెండవ స్థానంలో కొనసాగుతున్నది. తక్కువ ధరలో ఎక్కువ స్మార్ట్ ఫోన్ లను ఉత్పత్తి చేయడంతో ఈ వృద్దిని నమోదు చేసింది.

శామ్సంగ్ తర్వాత వివో 8.8 మిలియన్ యూనిట్ల అమ్మకాలతో 7 శాతం వృద్ధి నమోదు చేసింది. రియల్ ‌మీ 2020 క్యూ 3లో 8.7 మిలియన్ యూనిట్లను రవాణా చేసింది. అలాగే ఒప్పో కూడా 6.1 మిలియన్ యూనిట్లను రవాణా చేసింది. ఆపిల్, వన్‌ప్లస్ స్మార్ట్ ఫోన్ లు 1.6 శాతం, 1.1 శాతం మార్కెట్ వాటాతో ఉన్నాయి. 2019 క్యూ 3లో షియోమి 12.0 మిలియన్ యూనిట్లను రవాణా చేసింది, తరువాత శామ్సంగ్ (9.5 శాతం), వివో (7.4 శాతం), రియల్మే (7.1 శాతం) మరియు ఒప్పో (5.7 మిలియన్లు) ఉన్నాయి.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here