ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు సోషల్ మీడియా దిగ్గజాలు ఫేస్ బుక్, ట్విట్టర్ షాక్ ఇచ్చాయి. ట్రంప్ అకౌంట్లు 12 గంటలు పాటు తాత్కాలికంగా నిలివేశాయి. తమ నిబందనలకు విరుద్దంగా పోస్టులను పెట్టినందుకు వాటిని తొలగించడంతో పాటు అకౌంట్‌ను 12 గంటల పాటు నిలిపివేసినట్లు ట్విట్టర్ ప్రకటించింది. తమ నియమాలకు విరుద్దంగా ఉన్న పోస్టులను తొలిగించకపోతే ఖాతాను లాక్ చేస్తామని ట్విటర్ పేర్కొంది. ట్రంప్ స్పందించకపోవడంతో ట్విట్టర్ తన ట్వీట్లను తొలగించింది.

ఇంకా చదవండి: ఫేస్‌బుక్ ప్రొఫైల్ లాక్ చేయడం ఎలా..?

డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు జనవరి 6న యుఎస్ క్యాపిటల్ భవనంలోకి ప్రవేశించిన తర్వాత అక్కడ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. నిరసనకారులకు మద్దతుగా సపోర్ట్ చేస్తూ 3 ట్వీట్లు, ఒక వీడియోను పోస్ట్ చేశారు. అమెరికాలో గత ఏడాది నవంబర్ 3న జరిగిన ఎన్నికలకు సంబంధించి కొన్ని పోస్టులను పోస్టు చేయడంతో పాటు నిరసనకారులకు మద్దతుగా పోస్టు చేయడంతో వాటిని ట్విట్టర్, ఫేస్‌బుక్ తప్పుబట్టాయి. ఈ పోస్టులు ప్రజలను రెచ్చేగొట్టేవిదంగా ఉన్నాయని పేర్కొన్నాయి. అందుకే ఆ పోస్టులను తొలగించినట్లు పేర్కొన్నాయి.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్(YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.