Smartwatch Buying Guide Tips in Telugu: కరోనా మహమ్మారి తర్వాత ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం మీద శ్రద్ద పెరిగింది అని చెప్పుకోవాలి. గతంతో పోలిస్తే ఇప్పుడు మార్కెట్లోకి వచ్చే స్మార్ట్‌వాచ్‌లలో ఫిట్నెస్కి సంబంధించిన ఫీచర్స్ ఉండటంతో పాటు ఆకర్షణీయంగా ఉండటంతో వాటిని కొనేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు.
(ఇది కూడా చదవండి: Mobile Buying Guide in Telugu: కొత్త మొబైల్ కొనేముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!)
అయితే మీరు ఇప్పుడు రాబోయే ఫ్లిప్ కార్ట్, అమెజాన్ డీల్స్లో స్మార్ట్‌వాచ్ కొనాలని చూస్తుంటే.. ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయాలను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల మీరు తక్కువ బడ్జెట్లో మంచి స్మార్ట్ వాచ్ కొనే అవకాశం ఉంటుంది.
స్మార్ట్‌వాచ్‌లు కొనడానికి ముందు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఇవే!
స్క్రీన్(Display):
మీరు స్మార్ట్‌వాచ్ కొనేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలలో Display ఒకటి. వాచ్ డిస్ప్లే ఎంత మంచిగా ఉంటే అంతే మంచి అనుభూతి మనకు కలగుతుంది. యాపిల్, శాంసంగ్ వంటి ప్రీమియం స్మార్ట్‌వాచ్‌లలో ఓఎల్ఈడీ, అమోఎల్ఇడి డిస్ ప్లేలను మనం చూడొచ్చు.
(ఇది కూడా చదవండి: Laptop/System Buying Guide in Telugu: కొత్త ల్యాప్‌టాప్ కొనేముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!)
కానీ రియల్మీ, ఒప్పో మరియు షియోమీ, బోట్ వంటి వాచ్‌లలో LCD స్క్రీన్లను మీరు గమనించవచ్చు. కొన్ని ప్రత్యేక సందర్భాలలో మిడ్-రేంజ్ స్మార్ట్‌వాచ్‌లలో కూడా అమోఎల్ఇడి డిస్ప్లే పొందవచ్చు, ఇది ఎ+ల్సిడి స్క్రీన్ల కంటే మంచి డీల్. ఓఎల్ఈడీ లేదా అమోఎల్ఈడీతో పోలిస్తే LCD Displayలు తక్కువ బ్యాటరీ లైఫ్ అందిస్తాయి.
ఓఎస్(Operating System):
మీరు స్మార్ట్ వాచ్ కొనేటప్పుడు ముందుగా ఏ ఓఎస్ వాచ్ కోనాలనుకుంటున్నారో నిర్ణయించుకోవాలి. మీ దగ్గర ఆండ్రోయిడ్ ఫోన్ ఉంటే.. దానికి సపోర్ట్ చేసే వాచ్ కొనడం చాలా మంచిది.
ఫిట్‌నెస్ ట్రాకింగ్(Fitness Tracking):
ఇప్పుడు అన్నీ స్మార్ట్ వాచ్‌లలో ఫిట్‌నెస్ ట్రాకింగ్ ఫీచర్ అనేది తప్పకుండా మారింది. ప్రజలు ఎక్కువగా స్మార్ట్‌వాచ్‌లు కొనడానికి ఫిట్‌నెస్ ట్రాకింగ్ యాక్టివిటీ ఫీచర్ అనేది అతిపెద్ద కారణం. మీరు రోజు ఎన్ని కిలోమీటర్లు నడుస్తున్నారు, ఎన్ని కేలరీలు ఖర్చు చేస్తున్నారు.. BP, Heart Beat ట్రాకింగ్ వంటివి మీరు కొనే వాచ్లో ఉండే విధంగా తప్పకుండా చూసుకోండి.
బ్యాటరీ లైఫ్(Battery Life):
మీరు కొనాలనుకునే స్మార్ట్ వాచ్‌లలో బ్యాటరీ లైఫ్ అనేది ఎంత ఎక్కువగా వస్తే అంత మంచిది. ఇప్పుడు తక్కువ బడ్జెట్ వాచ్లలో బ్యాటరీ లైఫ్ అనేది ప్రధాన సమస్యగా మారింది. స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ గల వాచ్ లలో బ్యాటరీ లైఫ్ ఎక్కువగా వస్తుంది. కొన్ని వాచ్ లలో ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంటుంది.
కమ్యూనికేషన్(Communication):
మీరు కొనాలనుకునే వాచ్‌లలో ఇది కూడా ఒక ప్రధాన అంశం. మీ మొబైల్లో వచ్చిన టెక్స్ట్ సందేశాలు, మిస్డ్ కాల్స్ వంటి అలర్ట్ల గురించి తెలియజేయడానికి స్మార్ట్ వాచ్లు సులభతరం చేస్తాయి. కేవలం ఒక్క సేకనులో మీ స్మార్ట్ఫోన్ తీసుకోకుండానే మీకు ఎవరు కాల్ చేస్తున్నారో, మెసేజ్ చేస్తున్నారో తెలుసుకోవచ్చు. ఆపిల్, శామ్సంగ్ వంటి ఇతర ప్రీమియం స్మార్ట్‌వాచ్‌లు మీ ఫోన్ ఆఫ్ చేసినప్పటికీ ఎవరికైనా కాల్స్ చేయడానికి లేదా కాల్స్ చేసుకునే అవకాశాన్ని అందిస్తాయి.
ధర(Price):
అన్నీ విషయాల లాగే ఇది కూడా ఒక ప్రధాన అంశం. ఏ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ కొనుగోలు చేయాలనుకునేటప్పుడు ఇది ముఖ్య భూమిక పోషిస్తుంది. రియల్ మీ, వన్ ప్లస్, బోట్, వంటి కంపెనీలు చాలా సరసమైన ధరలలో చాలా మంచి ఎంట్రీ లెవల్ స్మార్ట్‌వాచ్‌లను అందిస్తున్నాయి. మీరు మిడ్-రేంజ్లో మెరుగైన వాచ్ కోసం చూస్తున్నట్లయితే.. ఫాసిల్ మరియు ఫిట్బిట్ వంటి సంస్థలు మంచి వాచ్లను అందిస్తున్నాయి. మీరు వాచ్ కొనేటప్పుడు మీ బడ్జెట్ ఎంతో ముందే నిర్ణయం తీసుకోవాలి.