చైనాలో ఇటీవల ఒక భారీ మోసం వెలుగులోకి వచ్చింది. చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ జియోనీ వినియోగదారులుకు తెలియకుండా ట్రోజన్ హార్స్‌ అనే వైరస్ ప్రవేశపెట్టినట్లు స్థానిక కోర్టు తెలిపింది. చైనాలోని ఒక న్యాయస్థానం జియోనీ ఫోన్‌లతో సంబంధం ఉన్న వివాదాస్పద అంశంపై ఇటీవల తీర్పు ఇచ్చింది. జియోనీ ఫోన్‌లలో అక్రమంగా ప్రవేశ పెట్టిన వైరస్ గురుంచి ఇటీవల తీర్పు వెలువరించింది.(చదవండి: రైల్వే ప్రయాణికుల కోసం కొత్త ఫీచర్ తీసుకొచ్చిన ఐఆర్‌సీటీసీ)

డిసెంబర్ 2018 నుండి అక్టోబర్ 2019 మధ్య ఒక యాప్ ద్వారా 20 మిలియన్లకు పైగా జియోనీ ఫోన్లలో ట్రోజన్ హార్స్‌ వైరస్ ను ఉద్దేశపూర్వకంగా ప్రవేశ పెట్టినట్లు కోర్టు తెలిపింది. “స్టోరీ లాక్ స్క్రీన్” అనే యాప్ ను అప్డేట్ చేయడం ద్వారా వినియోగదారుల ఫోన్‌లలో ట్రోజన్ హార్స్ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టడానికి షెన్‌జెన్ జిపు టెక్నాలజీ(జియోనీ యొక్క అనుబంధ సంస్థ)తో ఒప్పందం చేసుకున్నట్లు కోర్టు తెలిపింది. “పుల్ పద్ధతి”ని ఉపయోగించి వినియోగదారులకు తెలియకుండా సాఫ్ట్‌వేర్ ఆటోమెటిక్ గా జియోనీ మొబైల్ ఫోన్‌లలో అప్డేట్ చేయబడుతుంది. డిసెంబర్ 2018లో ప్రస్తుతం ఉన్న “పుల్” పద్ధతి అసమర్థంగా ఉందని నివేదిక పేర్కొంది. ఆ తర్వాత వాంగ్ డెంగ్కే హాట్ అప్‌డేట్ ప్లగ్-ఇన్ “డార్క్ హార్స్ ప్లాట్‌ఫామ్”ను “స్టోరీ లాక్ స్క్రీన్” వంటి యాప్ లో అమర్చాలని ప్రతిపాదించారు. వినియోగదారుకు తెలియకుండానే “లివింగ్ ట్రోజన్ హార్స్” ను ఇన్‌స్టాల్ చేసి అప్‌డేట్ చేయడానికి “డార్క్ హార్స్ ప్లాట్‌ఫాం” ఉపయోగించుకుంది.

కోర్టు తెలిపిన వివరాలు ప్రకారం, డిసెంబర్ 2018 నుండి 2019 అక్టోబర్ వరకు 2.88 బిలియన్ సార్లు 21.75 మిలియన్ స్మార్ట్‌ఫోన్‌లను ప్రభావితం చేయడంతో ప్రకటనల ద్వారా కంపెనీ సుమారు 4.2 మిలియన్లు అర్జించినట్లు తేలింది. దీంతో చట్ట విరుద్దంగా ఈ విదంగా మొబైల్ పరికరాలను నియంత్రించినందుకు న్యాయస్థానం గ్జూ లి, జో యింగ్, జియా జెంగ్కియాంగ్, పాన్ క్వి లను దోషులుగా తేల్చింది. వీరికి 3.5 సంవత్సరాల జైలు శిక్షతో పాటు, ఒక్కొక్కరికి 22,59,738 రూపాయల జరిమానా విధించింది. ఇన్ఫినిక్స్ , టెక్నో వంటి చౌకైన ఫోన్లను ఉత్పత్పి చేసే చాలా చైనీస్ స్మార్ట్‌ఫోన్‌లు కంపెనీలు ఆ లిస్ట్‌లో ఉన్నాయి.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.