షావోమి సంస్థ భారత మార్కెట్ లోకి 10,000 ఎంఏహెచ్ మరియు 20,000 ఎమ్ఏహెచ్ సామర్థ్యం గల రెండు కొత్త పవర్ బ్యాంక్ లను విడుదల చేసింది. ఈ పవర్ బ్యాంక్ లో యుఎస్బి టైప్-సి మరియు మైక్రో-యుఎస్బి పోర్ట్స్ ఉన్నాయి. ఇవి రెండు కూడా పవర్ బ్యాంకులు 18W ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తాయి. వీటిని అధునాతనమైన స్మార్ట్ పవర్ మేనేజ్మెంట్ ఫీచర్ తో 12-లేయర్ సర్క్యూట్ రక్షణతో వీటిని తయారు చేశారు. వీటిలో 2-వే ఫాస్ట్‌ ఛార్జింగ్ ఫీచర్‌ కూడా ఉంది. అంటే యూజర్‌ ఒకే సారి పవర్‌బ్యాంక్‌ను ఛార్జింగ్‌ పెట్టుకుంటూనే… దాని నుంచి వేరే డివైజ్‌ను ఛార్జ్‌ చేసుకోవచ్చు అన్న మాట.(చదవండి: బడ్జెట్ ధరలో మరో స్మార్ట్ ఫోన్ సిరీస్ ను లాంచ్ చేసిన రియల్ మీ)

20,000 ఎంఏహెచ్ సామర్థ్యం కలిగిన మి పవర్ బ్యాంక్ 3ఐ లో మూడు అవుట్పుట్ పోర్టులు ఉండగా, 10,000 ఎమ్ఏహెచ్ ఆప్షన్ రెండు అవుట్పుట్ పోర్ట్ లు ఉన్నాయి. మి పవర్ బ్యాంక్ 3i 12-లేయర్ సర్క్యూట్ ప్రొటెక్షన్ హార్డ్‌వేర్‌ను కలిగి ఉంది. ఇది లిథియం పాలిమర్ బ్యాటరీలను కలిగి ఉంది, ఇవి లి-అయాన్ బ్యాటరీలతో పోల్చినప్పుడు సురక్షితమైనవి మరియు మరింత సమర్థవంతమైనవి. ఇందులో లోపవర్‌ మోడ్ ఫీచర్ కూడా ఉంది. పవర్‌ బటన్‌ను రెండు సార్లు నొక్కిన తర్వాత లోపవర్‌ మోడ్‌లోకి వెళ్లిపోతుంది. అప్పుడు బ్లూటూత్‌ ఇయర్‌ఫోన్స్, ఫిట్‌నెస్‌ బ్యాండ్ వంటివి ఛార్జ్‌ చేసుకోవచ్చు. 10,000 ఎంఏహెచ్ సామర్థ్యం కలిగిన పవర్ బ్యాంక్ పూర్తిగా ఛార్జ్ అవ్వడానికి నాలుగు గంటలు పడుతుంది, 20,000 ఎమ్ఏహెచ్ సామర్థ్యం ఉన్న ఏడు గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. 10,000 ఎంఏహెచ్ వేరియంట్ ధర ₹899. 20,000 ఎంఏహెచ్ వేరియంట్ ధర ₹1,499. అమెజాన్‌, ఎంఐ.కామ్‌, ఫ్లిప్ కార్ట్ వెబ్‌సైట్‌లలో కొనుగోలు చేయొచ్చు.(చదవండి: బడ్జెట్ ధరలో మరో స్మార్ట్ ఫోన్ సిరీస్ ను లాంచ్ చేసిన రియల్ మీ)