Saturday, November 2, 2024
HomeGovernmentAndhra PradeshWhat is Land Records: డైగ్లాట్‌/ సేత్వార్‌ పహణీ, ఖాస్రా పహణీ, ఆర్‌ఓఆర్‌- 1బి అంటే...

What is Land Records: డైగ్లాట్‌/ సేత్వార్‌ పహణీ, ఖాస్రా పహణీ, ఆర్‌ఓఆర్‌- 1బి అంటే ఏమిటి?

What is Land Pahani: భూమితో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి వారికి ఎప్పుడో ఒకప్పుడు భూమి రికార్డుల అవసరం పడుతుంది. ఎందుకంటే భూమికి సంబంధించిన వివిధ వివరాలు ఈ భూమి రికార్డులలో ఉంటాయి.

భూమి ఎంతకాలం నుంచి సాగు చేస్తున్నారు/ అనుభవిస్తున్నారు/ స్వాధీనంలో ఉన్నా రికార్డుల్లో పేరు లేకపోతే చట్టపరంగా హక్కుదారులు కాలేరు. ఇంతటి ముఖ్యమైన రికార్డుల గురించి తేలుసుకోవడం చాలా అవసరం. భూమి రికార్డులు మూడు రకాలు – శాశ్వత భూమి రికార్డులు, గ్రామ భూమి లెక్కలు, వ్యక్తి గత భూమి రికార్డులు.

రెవెన్యూ రికార్డులు/శాశ్వత రికార్డులు(Revenue Records):

శాశ్వత భూమి రికార్డుల్లో సేత్వార్‌/ రిసెటిల్‌మెంట్‌ రిజిష్టర్‌, పొలం కొలతల పుస్తకం ఎఫ్ఎంబి/టిప్పన్‌, గ్రామ నక్ష/గ్రామ పటంలు ముఖ్యమైనవి.

a) సేత్వార్‌ పహాణీ/ రిసెటిల్‌మెంట్‌ రిజిష్టర్‌/ సెటిల్‌మెంట్‌ ఫెయిర్‌ అడంగల్‌

ఏపీలో 1910-1920 ప్రాంతంలో జమిందారీలను రద్దు చేసిన ప్రాంతాలలో సర్వే సెటిల్‌మెంట్‌ జరిపి సెటిల్‌మెంట్‌ శాఖ రూపొందించినదే సెటిల్‌మెంట్‌ ఫెయిర్‌ అడంగల్‌/రిసెటిల్‌మెంట్‌ రిజిష్టర్‌. బ్రిటీష్‌ ప్రభుత్వం రైత్వారీ విధానాన్ని అమలు పరిచిన గ్రామాలలో వారు రూపొందించిన రిజిష్టర్‌ను డైగ్లాట్‌ లేదా సెటిల్‌మెంట్‌ రిజిష్టరు అని, అంటారు.

- Advertisement -

ఇవి రెండూ ఒకే విధమైన ప్రతిపత్తిని కలిగి ఉంటాయి. అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో 1934 ప్రాంతంలో నైజాం సర్కారు భూముల బందోబస్తు(ల్యాండ్‌ సెటిల్‌మెంట్‌) చేసింది. ఒక పద్ధతి ప్రకారం భూములకు సర్వే నంబర్లు, మ్యాపులతో సహా రికార్డులను రూపొందించింది. దీనినే తెలంగాణలో సేత్వార్‌ పహాణీ అని అంటారు.

రెండూ తెలుగు రాష్ట్రాలలో ఒక్కొక్క గ్రామానికి సర్వే సెటిల్‌మెంట్‌ పూర్తిచేసి వీటిని తయారుచేశారు. అన్ని గ్రామ లెక్కలకు రిసెటిల్‌మెంట్‌ రిజిష్టర్‌/ సేత్వార్‌ పహాణీ/ సెటిల్‌మెంట్‌ ఫెయిర్‌ అడంగల్‌ మూలస్తంభం వంటిది. గ్రామము గుడికట్టు అనగా మొత్తం విస్తీర్ణం తెలియజేయును.

ఈ రిజిష్టర్‌లో ఒక రెవెన్యూ గ్రామానికి సంబంధించిన అన్ని రకముల భూముల యొక్క సర్వే నంబర్లు, వాటి వర్గీకరణ, శిస్తు వివరాలు, పంటల వివరాలు, వాటి దిగుబడి, నీటి పారుదల తదితర వివరాలతో సహా పొందుపరచబడి ఉండును. పన్ను వసూలు కోసం అప్పట్లో ఏపీలో బ్రిటీష్‌ ప్రభుత్వం, తెలంగాణలో నైజాం సర్కారు ఈ రికార్డులను తయారు చేశాయి. వీటిలో కేవలం ప్రధాన సర్వే నెంబర్లకు సంబంధించి వివరాలు ఉంటాయి.

(చదవండి: ఎవరు మీలో కోటీశ్వరులు షోలో కోటి రూపాయలు గెలుచుకున్న ఎస్సై?)

b) గ్రామ పటం:

శాశ్వత ఏ రిజిష్టరు ప్రకారం గ్రామంలోని మొత్తం భూములన్నింటిని రేఖా చిత్ర పటంలో చూపించేదే గ్రామ పటం. ఒక్క మాటలో చెప్పాలంటే గ్రామ భౌతిక రూపం గ్రామ పటంలో కనిపిస్తుంది. గ్రామంలోని భూములను గుర్తించుటకు గ్రామ పటం ఉపయోగపడుతుంది. ఏపీలో దీనిన్ గ్రామ పటం అని, తెలంగాణలో నక్ష అని అంటారు.

C) పొలం కొలతల పుస్తకం (ఎఫ్ఎంబి)/టిప్పన్‌

శాశ్వత ఏ రిజిష్టరు ప్రకారం గ్రామంలో గల భూములన్నింటిని సర్వే నంబరు వారీగా, సబ్‌ డివిజన్‌ నంబరు వారీగా కొలతలు, విస్తీర్ణంతో సహా తెలియచేయు రిజిష్టరు ఎఫ్ఎంబి) /టిప్పన్‌. ఇందులో ఒక్కొక్క సర్వే నంబరుకు ఒక్కొక్క పటము ఉండును.

- Advertisement -

వీటన్నింటిని వరుస క్రమంలో పెట్టి తయారు చేసినదే పాలం కొలతల పుస్తకం. దీనినే ఆంధ్రా ప్రాంతంలో ఎఫ్‌.ఎం.బి. అని, తెలంగాణ ప్రాంతంలో ‘టిప్పన్‌’ అని పిలుస్తారు. ఈ రికార్డు సరిహద్దు వివాదములను పరిష్కరించుటకు ఉపయోగ పడుతుంది.

గ్రామ రెవెన్యూ అధికారిచే గ్రామ భూములవివరాలు మొత్తం 11 గ్రామ లెక్కలుగా నిర్వహించబడతాయి. ఇవి మండల తహసీల్దారు పర్యవేక్షణలో ఉంటాయి.

గ్రామ రెవెన్యూ లెక్కలు:

  • గ్రామ లెక్క నం. 1 : ప్రభుత్వ భూములు, కౌలుకు ఇవ్వబడిన భూములు, దరఖాస్తు భూములు, అన్యాక్రాంతములు, దరఖాస్తు కింద పట్టాకు ఇవ్వదగు విస్తీర్ణం తెలియజేయు రిజిష్టర్‌.
  • గ్రామ లెక్క నం. 2 : భూముల ఆధీనంలో మార్పులను తెలియజేయు రిజిష్టర్‌
  • గ్రామ లెక్క నం. 3 : పహాణీ/అడంగల్‌ – భూమి అనుభవము, ఆక్రమణ, సాగుబడి తెలియచేయు రిజిష్టర్‌
  • గ్రామ లెక్క నం. 4 : భూకమతం, భూమి శిస్తు డిమాండు రిజిష్టర్‌
  • గ్రామ లెక్క నం. 5 : భూమి డిమాండు, వసూలు, విలువ తెలియజేయు లెక్క
  • గ్రామ లెక్క నం. 6 : రోజువారి వసూలు తెలియజేయు లెక్క
  • గ్రామ లెక్క నం. 7 : యిర్సాలునామా
  • గ్రామ లెక్క నం. 8 : జలాధారములను తెలుపు రిజిష్టర్‌
  • గ్రామ లెక్క నం. 9 : భూమి శిస్తు చెల్లింపునకు రశీదు
  • గ్రామ లెక్క నం. 10, 11: జనన, మరణములు నమోదు చేయు రిజిష్టరు.

వ్యక్తిగత భూమి రికార్డులు:

  1. ఒక వ్యక్తికి వివిధ రకాలుగా భూమి సంక్రమించవచ్చు. అలా సంక్రమించిన భూమికి హక్కుదారు ఆ వ్యక్తి అని చెప్పటానికి రుజువు వారికి అందించబడిన రికార్డులను వ్యక్తిగత భూమి రికార్డులు అంటారు. కొన్ని ప్రత్యేక సందర్భాలలో జారీ చేయబడిన సర్టిఫికెట్‌లు. ఆ రికార్డులు మన చేతిలో ఉన్నప్పుడు మాత్రమే మన భూమికి భద్రత, పూర్తి హక్కు లభిస్తుంది. అవేంటో ఈ క్రింద తెలుసుకోండి.
  • పట్టాదారు పాస్‌ పుస్తకం,టైటిల్‌ డీడ్‌
  • డీ ఫారమ్‌, డికెటి పట్టా/అసైన్‌మెంట్‌ పట్టా
  • రిజిష్టర్డ్‌ దస్తావేజు
  • సాదాబైనామా లేదా 13-బి సర్టిఫికెట్‌
  • 80-ఈ సర్టిఫికెట్‌(రక్షిత కౌల్టారు సర్టిఫికెట్‌)
  • ఓఆర్‌సీ సర్టిఫికెట్‌(ఇనాం భూమిపై ఆక్యుపెన్సీరైట్స్‌ సర్టిఫికెట్‌)
  • దాన పత్రం (గిఫ్ట్‌ డీడ్‌)
  • దేవాదాయ భూమి కౌలు తీసుకుని ఉంటే కౌలు రశీదు
  • అటవీ భూమిలో సాగులో ఉన్న గిరిజనులకు ఇచ్చే అటవీ భూములహక్కు పత్రం(ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ఏ)

శాశ్వత రికార్డులు:

  • సెటిల్‌మెంట్‌ ఫెయిర్‌ అడంగల్‌/ డైగ్లాట్‌/ సేత్వార్‌ పహణీ/ రిసెటిల్‌మెంట్‌ రిజిష్టర్‌
  • పాలం కొలతల పుస్తకం (ఎఫ్‌.ఎం.బి/టిప్పన్‌)
  • గ్రామ నక్ష/గ్రామ పటం

a) ఖాస్రా పహణీ(Khasra Pahani)

అప్పటి ఉమ్మడి కుటుంబాల్లో ఒకే వ్యక్తి పేరుమీద ఉన్న భూరికార్డులను మార్పు చేస్తూ, తొలిసారిగా రైతువారీగా భూమి పట్టా హక్కు కల్పించిన ఖాస్రా పహణీ. దీనిని 1953-54లో ప్రవేశ పెట్టారు. ఈ రికార్డులో కుటుంబ సభ్యుల బై సర్వే నెంబర్ వివరాలు, భూ కమతం, భూ పటం అన్నీ వివరాలు చాలా వివరంగా ఉన్నాయి.

సేత్వార్‌ పహాణీ తర్వాత ఇది చాలా ముఖ్యమైనది. అందుకని ఇప్పుడు భూ పరిష్కరించేందుకు ఈ పహణీ ఒక ఆధారంగా పనిచేస్తుంది. మీ భూమి గనుక ప్రభుత్వ నిషేదిత జాబితాలో పడితే అందులో నుంచి మీ భూమిని తొలగించడానికి ఇది చాలా ముఖ్యం.

(చదవండి: పెట్రోల్, డీజిల్ ద్వారా వచ్చే డబ్బును కేంద్ర, రాష్ట్రాలలో ఎవరు ఎక్కువగా తింటున్నారు?)

b) ఆర్‌ఓఆర్‌(రికార్డ్‌ ఆఫ్‌ రైట్స్‌)-1బి(ROR -1B):

దీన్నే భూ యాజమాన్య హక్కుల పుస్తకం అంటారు. ఆర్‌ఓఆర్‌నే- 1బి అని కూడా అంటారు. గతంలో దీన్నే టెన్‌వన్‌ అడంగల్‌ అనే వారు. ఎవరెవరికి ఎంతెంత భూమి ఏవిధంగా సంక్రమించిందనే సమాచారం ఇందులో ఉంటుంది. పూర్తి భూ వివరాలు 1992 నుంచి కనిపిస్తున్నాయి.

- Advertisement -

C) ఆర్‌ఎస్‌ఆర్‌(RSR):

దీన్నే రీసర్వే రిజిస్టర్‌ అంటారు. సర్వే నంబర్ల వారీగా భూమి విస్తీర్ణం, హక్కుదారుల వివరాలతో దీన్ని తయారు చేశారు. ఇది రెవెన్యూ శాఖలో అత్యంత ప్రామాణికమైనది.

D) అడంగల్‌/పహణీ(Adangal Pahani):

భూమి యాజమాన్యపు హక్కు రికార్డు. దీన్ని కోస్తాలో ‘అడంగల్‌’ అని, తెలంగాణలో పహణీ అని అంటారు. రెవెన్యూ రికార్డుల్లో మూడోనంబర్‌ రిజిష్టర్‌ను పహానిగా పిలుస్తారు. ఇందులో 16 కాలమ్స్‌ ఉంటాయి. భూమికి సంబందించిన సాధికారిక చరిత్ర మొత్తం ఇందులో ఉంటుంది.

(ఇది కూడా చదవండి: Vacant Land Tax: వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ అంటే ఏమిటి? ఖాళీగా ఉన్న భూమిపై పన్ను చెల్లించాలా?)

ఇది ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించే రికార్డు. భూముల అమ్మకాలు కొనుగోళ్లు, సాగు చేస్తున్న పంట వివరాలు ఎప్పటికప్పుడు ఇందులో నమోదు చేస్తారు. ప్రతి సంవత్సరం ఒక పహానీ తయారు చేస్తారు.

ప్రస్తుతం తెలంగాణలో వ్యవసాయ భూములకు సంబంధించిన వివరాలు అన్నీ ధరణిలో ఉన్నాయి. ఇది కూడా ఒకరకమైన పహణీ లాంటిదే. ఇక ఏపీలో మీ భూమి పోర్టల్ లో రాష్ట్ర వ్యవసాయ భూములకు సంబంధించి అన్నీ వివరాలు ఉన్నాయి. వీటిని కొత్త రకం పహణీలు అంటారు.

వీటన్నింటికీ మూలం మాత్రం ఖాస్రా పహణీ/ సెటిల్‌మెంట్‌ ఫెయిర్‌ అడంగల్‌/ డైగ్లాట్‌/ సేత్వార్‌ పహణీలే. అందుకు మీ భూమికి సంబంధించిన ఈ పహణీ నఖలు కచ్చితంగా ఉండాల్సి ఉంటుంది.

టెక్ పాఠశాల తాజా వార్తల కోసం ఇప్పుడే ఈ లింకు http://bit.ly/45sSz9h క్లిక్ చేయండి!

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles