మీ దగ్గర డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ఉందా?. రెండింటిలో ఏదైనా ఒక కార్డును ఎప్పుడు ఉపయోగిస్తుంటారా? అయితే, మీకు ఒక శుభవార్త. మీకు ఉచితంగానే వ్యక్తిగత ప్రమాద బీమా లభించే అవకాశం ఉంది. బ్యాంకులు జారీ చేసే డెబిట్, క్రెడిట్ కార్డులు కాంప్లిమెంటరీ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజీతో వస్తాయి అని మనలో ఎంత మందికి తెలుసు. రూపే డెబిట్ కార్డు కలిగి ఉన్న ఖాతాదారులకు బ్యాంకు ఉచితంగానే వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజీని అందిస్తుందని చెన్నైకి చెందిన ఒక ఇండియన్ బ్యాంక్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

₹50,000 నుంచి ₹10 లక్షల బీమా

బ్యాంకులు జారీ చేసే అన్ని డెబిట్, క్రెడిట్ కార్డ్ వేరియెంట్లపై బీమా కవరేజీ లభిస్తుందని ఆయన తెలిపారు. ఖాతాదారులు ప్రమాదవశాత్తు మరణించిన, శాశ్వత సంపూర్ణ వైకల్యం చెందిన బీమా అందిస్తారు.డెబిట్, క్రెడిట్ కార్డులను బట్టి బీమా కవరేజీ ₹50,000 నుంచి ₹10 లక్షల వరకు లభిస్తుంది. అనుకోకుండా జరిగే ప్రమాదాల వల్ల ఖాతాదారుడు మరణిస్తే లేదా శాశ్వత సంపూర్ణ వైకల్యం చెందితే బీమా కవరేజీ లభిస్తుందని ఒక బ్యాంక్ తెలిపారు. ఉద్దేశ్యపూర్వకంగా లేదా స్వయంకృతాపరాధం వల్ల జరిగిన ప్రమాదాలకు కాదు అని ఆయన అన్నారు. బీమా కవరేజీ ఎంత అనేది బ్యాంకుతో వినియోగదారులకు ఉన్న సంబంధంపై ఆధారపడి ఉంటుంది. డెబిట్, క్రెడిట్ కార్డులు రెండింటికీ బీమా కవరేజీ ₹2 లక్షల నుంచి ప్రారంభమై ₹10 లక్షల వరకు లభిస్తుందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ వర్గాలు తెలిపాయి.

కార్డులు ఎక్కువగా వాడాలి

ఇటువంటి సదుపాయాల గురించి ఖాతాదారులకు అవగాహన లేదని, వారికి తెలియజేయడం బ్యాంకుల విధి అని యూజర్ల ఫోరం యాక్టివిస్ట్ శ్రీ సదాగోపన్ అన్నారు. బీమా క్లెయిమ్ చేసుకోవడానికి కొన్ని షరతులు ఉన్నాయి. అవి ఏమిటంటే? మీ కార్డు యాక్టివ్ గా ఎల్లప్పుడూ ఉండాలి. కనీసం మూడు నెలలకు ఒకసారైన కార్డు ద్వారా లావాదేవీలు జరపాలి. అలాగే, క్లెయిం కోసం నిర్ధిష్ట కాలవ్యవధిలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

ఉదాహరణకు, రూపే కార్డు కింద లభించే బీమా కోసం ప్రమాదం జరిగిన తేదీ నుంచి 90 రోజుల్లోగా క్లెయిమ్ కోసం బ్యాంక్ అధికారులకు సమాచారం అందించాలి. అలాగే క్లెయింకు సంబంధించి సమాచారం ఇచ్చిన 60 రోజుల్లోగా అన్ని సపోర్టింగ్ డాక్యుమెంట్లను సబ్మిట్ చేయాలి. అలాగే, ప్రమాదం జరిగిన తేదీకి 90 రోజుల ముందు వరకు కార్డుదారుడు ఏదైనా ఒక లావాదేవీ(ఆర్థిక లేదా ఆర్థికేతర లావాదేవీ) చేయాల్సి ఉంటుంది. కస్టమర్లకు అందించే బీమా రకాలు, బీమా క్లెయిం ప్రక్రియ గురించి బ్యాంకులను ఏడాదికి ఒకసారి ఆడిట్ చేయాలని ఆర్ధిక నిపుణులు సూచిస్తున్నారు.

Support Tech Patashala

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here