పాన్-ఆధార్ అనుసంధాన గడువును ఈ ఏడాది జూన్ 30 నుంచి సెప్టెంబర్ 80 వరకు పొడిగిస్తూ ఆదాయపన్ను శాఖ ప్రకటన విడుదల చేసింది. కరోనా మహమ్మరి నేపథ్యంలోనే ఈ పొడగింపుకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. దీంతో పాటు ఉద్యోగి కరోనా చికిత్స కోసం సంస్థ చేసే చెల్లింపులపై పూర్తి పన్ను మినహాయింపును ప్రకటించింది. అంతేకాదు చికిత్స కోసం వ్యక్తుల నుంచి తీసుకునే మొత్తం పైనా పన్ను మినహాయింపు లభిస్తుంది. ఉద్యోగి కరోనాతో మరణించిన కేసుల్లో సంస్థ నుంచి వారి కుటుంబ సభ్యులకు చెల్లి, ఎక్స్‌గ్రేషియాపైనా పూర్తి పన్ను మినహాయింపు ఉంటుందని తెలిపింది.(ఇది కూడా చదవండి: ప్రతి పర్యటనలో నరేంద్ర మోడీ పక్కన ఉన్న ఈ మహిళా ఎవరు?)
అయితే, సంస్థ నుంచి కాకుండా ఇతరత్రా ఏ వ్యక్తి నుంచి అయినా నగదు సాయాన్ని స్వీకరిస్తే పన్ను మినహాయింప్తు రూ.10 లక్షలకు పరిమితమవుతుంది. ‘వివాద్ సే విశ్వాస్’ పథకం గడువును అగస్ట్ 81 వరకు పొడిగించింది. ఫామ్-16 రూపంలో టీడీఎస్. సర్జిఫికెట్‌ను ఉద్యోగులకు ఇచ్చే గడువును జూలై 81గా నిర్ణయించింది. అలాగే నిబందనల ప్రకారం మొదటిసారి ఇల్లును కొనుగోలు చేస్తే దానిపై పెట్టె పెట్టుబడిపై పన్ను మినహాయింపు పొందవచ్చు. ఇప్పుడు ఈ గడువును జూన్ 30 నుంచి మరో 3 నెలలు పొడగించింది.
Support Tech Patashala

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.