Saturday, November 23, 2024
HomeBusinessతక్కువ వడ్డీకే హోమ్ లోన్ అందిస్తున్న టాప్-10 బ్యాంకులు ఇవే!

తక్కువ వడ్డీకే హోమ్ లోన్ అందిస్తున్న టాప్-10 బ్యాంకులు ఇవే!

మీరు మీ సొంతింటి కల సాకారం చేసుకోవాలని భావిస్తున్నారా? అయితే మీ దగ్గర సొంతిల్లు కట్టుకోవడానికి తగినంత డబ్బులు మీ దగ్గర లేవా? అయితే మీకు ఒక శుభవార్త. చాలా బ్యాంకులు లేదా ఎన్‌బీఎఫ్‌సీలు తక్కువ వడ్డీకే గృహ రుణాలను అందిస్తున్నాయి. హోమ్ లోన్ అన్నది ఒక తెలివైన ఎంపిక అని చెప్పుకోవాలి. ఇది మీ కలల గృహాన్ని సొంతం చేసుకునేందుకు, మీరు డబ్బుల కోసం ఇబ్బంది పడకుండా లభించే ఒక గొప్ప అవకాశం.

ఆర్బీఐ కూడా రెపోరేట్లను 4 శాతానికి తగ్గిస్తూ తీసుకున్ననిర్ణయం కారణంగా హోమ్ లోన్ వడ్డీరేట్లు ఇప్పుడు ఆల్ టైమ్ తక్కువకు లభిస్తున్నాయి. ఏది ఏమైనా, హౌసింగ్ లోన్ అన్నది ఒక కీలకమైన అడుగు కాబట్టి గృహ రుణాలను బ్యాంక్ నుంచి తీసుకునే ముందు కొన్ని విషయాలు గుర్తించుకోవాలి. హోమ్ లోన్ అనేది ఎక్కువ మొత్తంతో కూడుకున్న వ్యవహారం.

అందుకే వడ్డీ రేట్లకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. వడ్డీ రేట్లు కొంచెం తగ్గిన దీర్ఘకాలంలో భారీ ప్రయోజనం చేకూరుతుంది. అందువల్ల వడ్డీ రేటు తక్కువున్న బ్యాంకులో లోన్ తీసుకుంటే మంచిది. ప్రస్తుతం తక్కువ వడ్డీకే హోమ్ లోన్ అందిస్తున్న బ్యాంకులు జాబితాను మీ కోసం అందిస్తున్నాం. వీటితో పాటు ప్రాసెసింగ్ ఫీజు ఆధనం అని గుర్తుంచుకోవాలి.

కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో హోమ్ లోన్ వడ్డీ రేటు 6.65 శాతం

కోటక్ మహీంద్రా బ్యాంక్‌: వడ్డీ రేటు: 6.65 నుంచి 7.30 శాతం, ఈఎమ్ఐ: రూ.22,633 నుంచి రూ.23,802, ప్రాసెసింగ్ ఫీజులు: రుణ మొత్తంలో 2% + జిఎస్ టీ + ఇతర చట్టబద్ధమైన ఫీజులు.

ఐసీఐసీఐ బ్యాంక్‌లో హోమ్ లోన్ వడ్డీ రేటు 6.70 శాతం

ఐసీఐసీఐ బ్యాంక్‌: వడ్డీ రేటు: 6.70 నుంచి 8.05% , ఈఎంఐ: రూ.22,722 నుంచి రూ.25,187, ప్రాసెసింగ్ ఫీజులు: రుణ మొత్తంలో 0.5 నుంచి 2% లేదా + జిఎస్ టీ.

- Advertisement -
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో హోమ్ లోన్ వడ్డీ రేటు 6.70 శాతం

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్: వడ్డీ రేటు: 6.70 నుంచి 7.20%, ఈఎమ్ఐ: రూ.22,722 నుంచి రూ.23,620, ప్రాసెసింగ్ ఫీజులు: రుణ మొత్తంలో 1.50% వరకు లేదా రూ.4,500 + పన్ను.

బ్యాంక్ ఆఫ్ బరోడా‌లో హోమ్ లోన్ వడ్డీ రేటు 6.75 శాతం

బ్యాంక్ ఆఫ్ బరోడా‌: వడ్డీ రేటు: 6.75 నుంచి 8.70% , ఈఎంఐ: రూ.22,990 నుంచి రూ.26,416, ప్రాసెసింగ్ ఫీజులు: రుణ మొత్తంలో 0.50 శాతం వరకు (కనీసం రూ.8,500 మరియు గరిష్టంగా రూ.25,000)
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌:
వడ్డీ రేటు: 6.80 నుంచి 8.90%, ఈఎంఐ: రూ.22,900 నుంచి రూ.26,799, ప్రాసెసింగ్ ఫీజులు: బ్యాంకును సంప్రదించవచ్చు.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా:
వడ్డీ రేటు: 6.85 నుంచి 9.05%, ఈఎమ్ఐ: రూ. 22,990 నుంచి రూ. 27,088, ప్రాసెసింగ్ ఫీజు: రుణ మొత్తంలో 0.50 శాతం వరకు (గరిష్టంగా రూ.20,000).
ఐడీబీఐ బ్యాంక్‌
: వడ్డీ రేటు: 6.90 నుంచి 9.90%, ఈఎంఐ: రూ.23,079 నుంచి రూ.28,752, ప్రాసెసింగ్ ఫీజులు: రూ.5,000 నుంచి రూ.20,000 + జిఎస్ టి.
యాక్సిస్ బ్యాంక్: వడ్డీ రేటు: 6.90 నుంచి 8.40%, ఈఎమ్ఐ: రూ.23,079 నుంచి రూ.25,845, ప్రాసెసింగ్ ఫీజులు: రుణ మొత్తంలో 1%.

కెనరా బ్యాంక్‌ హోమ్ లోన్ వడ్డీ రేటు 6.90 శాతం

కెనరా బ్యాంక్‌: 6.90 నుంచి 8.90%, ఈఎంఐ: 23,079 నుంచి రూ.26,799, ప్రాసెసింగ్ ఫీజులు: రుణ మొత్తంలో 0.50 శాతం (కనీసం రూ.1,500 మరియు గరిష్టంగా రూ.10,000)

ఎస్‌బీఐలో హోమ్ లోన్ వడ్డీ రేటు 6.95 శాతం

ఎస్‌బీఐలో హోమ్ లోన్ వడ్డీ రేటు 6.95 శాతం
బ్యాంక్ ఆఫ్ ఇండియా: వడ్డీ రేటు: 6.95 నుంచి 8.85%, ఈఎమ్ఐ: రూ.23,169 నుంచి రూ.26,703.

గమనిక: ఒక వ్యక్తికి వర్తించే వడ్డీరేటు వయస్సు, లింగం, ఆదాయం, క్రెడిట్ స్కోరు, రుణ మొత్తం, ఆస్తి విలువ, బ్యాంకు/రుణదాత ద్వారా పేర్కొనబడ్డ అనేక ఇతర నియమ నిబంధనలను బట్టి ఉంటుంది.

- Advertisement -

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles