ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితంలో మొబైల్ ఒక భాగమైంది. దీని వల్ల ఎంత మంచి జరుగుతుందో, అంతే స్థాయిలో కిడు కూడా జరుగుతుంది. ఈ మధ్యనే ప్రముఖ సామజిక దిగ్గజం ఫేసుబుక్ సంస్థకు చెందిన 533 మిలియన్ల మంది డేటా బయటికి విడుదల అయిన సంగతి తెలిసిందే. లీకైన డేటాలో ఫేసుబుక్ సీఈఓ మార్క్ జూకర్ బర్గ్ ఫోన్ నెంబర్ కూడా లీకైన విషయం వార్తల్లో హాల్ చల్ చేస్తుంది. ఈ లీకైన డేటా వల్ల భవిష్యత్ లో చాలా ప్రమాదం పొంచి ఉంది.(ఇది చదవండి: ఆన్‌లైన్‌లో లీకైన 53.3 కోట్ల ఫేస్‌బుక్ యూజర్ల డేటా!)

అందుకని మన డేటా లేదా మొబైల్ ను ఎవరైనా హ్యాక్ చేశారా? లేదా అనేది మనం తెలుసుకోవచ్చు. ఇలా తెలుసుకోవడం వల్ల ఒక వేల మన డేటా లేదా మొబైల్ హ్యాకింగ్ గురైనట్లు తెలుస్తే వెంటనే పాస్ వర్డ్స్ మార్చడం లాంటి పలు జాగ్రత్తలు తీసుకోవచ్చు. దీని కోసం మీరు ప్రముఖ వెబ్‌సైట్ (https://haveibeenpwned.com/)కీ వెళ్లి డేటా లీక్ అయ్యిందో లేదో తెలుసుకోవచ్చు. ఈ వెబ్‌సైట్‌కి వెళ్లి ఫేస్‌బుక్‌ లాగిన్ ఇచ్చిన లేదా మీ ఈమెయిల్ వివరాలు ఎంటర్ చేయండి. ఈ వెబ్‌సైట్ మీ డేటా లీక్ అయిందో లేదా అనేది సూచిస్తుంది. అలాగే మీ మొబైల్ నెంబర్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు.

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.