ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రధాన భాగమైంది. దీంతో కొన్ని వేల పనులు చిటికలో చేస్తున్నాము. ఇది చాలా వరకు మన సమయాన్ని కూడా ఆదా చేస్తుంది. ప్రపంచంలో జరిగే ప్రతి చిన్న విషయం క్షణాలలో మనకు తెలిసిపోతుంది. ప్రస్తుతం మార్కెట్లో చౌకగా మొబైల్ లభించడం వల్ల దీని వినియోగం రోజు రోజుకి పెరిగిపోతుంది. అయితే, దీని వల్ల మనకు ఎంత మంచి జరుగుతుందో. అంతే స్థాయిలో చేదు జరుగుతుంది అని చెప్పుకోవాలి.
నిజానికి ఫోన్ల వాడకం వలన మన శరీరం మీద హానికలిగించే రేడియషన్ ప్రభావం ఉంటుంది. అలాగే, ఈ మధ్య కాలంలో వచ్చే కొన్ని స్మార్ట్ ఫోన్లలో సిగ్నల్ కోసం అని అత్యధికమైన రేడియషన్ వెదచల్లుతునట్లు కొన్ని నివేదికల ద్వారా బయటికి వచ్చింది. అయితే, దీన్ని పూర్తిగా నివారించడం అసాధ్యం. కానీ, సరైన పద్దతిలో మొబైల్ వాడడం వలన రేడియషన్ ప్రభావం నుంచి తప్పించుకోవచ్చు. ఇప్పుడు అది ఎలాగో మనం ఒకసారి తెలుసుకుందాం.
ఇయర్ ఫోన్స్ తో మాట్లాడటం:
ఎవరితోనైనా మనం మొబైల్ లో మాట్లాడేటప్పుడు ఇయర్ ఫోన్స్ వాడడం ద్వారా చాలా వరకు రేడియేషన్ నుండి తప్పిచుకోవచ్చు. ఇలా ఇయర్ ఫోన్స్ ద్వారా ఫోన్ లో మాట్లాడేటప్పుడు మన మెదడుకు ద్గగరగా ఫోనులో వుండే యాంటెన్నాఉంటుంది కాబట్టి అది నేరుగా మన మెదడు పైన ప్రభావాన్ని చూపిస్తుంది. అలాగే, ప్రతి చిన్న విషయానికి ఫోన్ చేయకుండా టెక్స్ట్ రూపంలో సందేశాలు పంపించుకుంటే మంచిది. ఇలా చేయడం ద్వారా కొంచెం వరకు రేడియేషన్ తప్పించుకోవచ్చు.
ఫోన్ వాడకాన్ని తగ్గిచుకోవడం:
“అతిగా తింటే అమృతం కూడా విషం అవుతుంది” అనే సామెత మొబైల్ విషయంలో కచ్చితంగా నిజమవుతుంది. అతిగా ఫోన్ వాడకం వల్ల కేవలం రేడియేషన్ ప్రభావం మాత్రమే కాకుండా ఓత్తిడి, మానసిక ఆందోళన, నిద్రలేమితనం వంటి మరెన్నో రుగ్మతలకు కారణమవుతుందని అమెరికాకి చెందిన నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ దీని గురించి తెలిపింది. కాబట్టి, మీకు అవసంరం లేని సమయంలో వీలైనంత వరకు ఫోనును దూరంగా పెట్టండి.
మొబైల్ కి దూరంగా పడుకోండి:
ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ వారి ఫోన్లను ఒక అలారం గడియారంలా వాడుతున్నారు. మీరు అలారం ఆన్ చేసి ఫోన్ మీ తల దగ్గర పెట్టి పడుకుంటే, అప్పుడు రేడియేషన్ మీ మెదడు మీద చేదు ప్రభావాలు చూపిస్తుంది. ఇంకో విషయం ఏమిటంటే, ఫోన్ ఏరోప్లేన్ మోడ్ లో వున్న సరే దానిలోని యాంటెన్నా, బ్యాటరీ రేడియేషన్ విడుదల అవుతుంది. కాబట్టి ఫోన్ ఆఫ్ చెయ్యడమే సరైన పరిష్కారం. ఇలా దూరంగా పెట్టి పడుకోవడం అనుకున్న సమయానికి లేచే అవకాశం ఉంటుంది.
సిగ్నల్ లేనపుడు ఫోన్ వాడకం తగ్గించాలి:
ఫోన్ లో చాలా తక్కువగా సిగ్నల్ ఉన్నపుడు వీలైనంత వరకూ ఫోన్ వాడకాన్ని తగ్గించాలి. ఎందుకంటే, సిగ్నల్ తకువగా ఉన్నపుడూ మన ఫోన్ లోనీ యాంటెన్నాసిగ్నల్ కోసం అత్యదికంగా తరంగాలను విడుదల చేస్తుంది. కాబట్టి, ఈ విషయంలో జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం.
మొబైల్ ఎప్పుడు జేబులో పెట్టుకోకండి:
మీ మొబైల్ ని జేబులో ఎల్లపుడు మీతోనే అంటిపెట్టుకుని ఉంచుకోవడాన్నితగ్గించండి. ఇలా మీతో పాటుగా ఎల్లప్పుడు ఫోన్ పెట్టుకోవడం ద్వారా మీ మీద రేడియేషన్ ప్రభావం ఉంటుంది. కాబట్టి , మీ ఫోనుతో అవసరం లేనప్పుడు మీ నుంచి కొంత దూరంలో ఉండేలా చూసుకోండి. పైన చెప్పిన విధంగా చేయడం వలన రేడియేషన్ పూర్తిగా తగ్గించకపోయిన కొంత మేరకు తగ్గించవచ్చు.
మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.