ప్రస్తుతం ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. అంతలా విస్తరించింది ఈ మొబైల్ ప్రపంచం. ఇక స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఫోన్ లో తప్పనిసరిగా వాట్సాప్ మెసేజింగ్ యాప్ ఉంది తీరాల్సిందే. వాట్సాప్ తన యూజర్లు సంఖ్యను పెంచుకోవడానికి ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తీసుకొని వస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ దీనిని విపరీతంగా వాడుతుంటారు.
వినియోగదారుల సౌలభ్యం కోసం అనేక ఫీచర్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటి తమకు నచ్చని వారిని బ్లాక్ చేసుకునే సౌకర్యం. ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ చేశారో తెలుసుకోవడానికి కొన్ని ట్రిక్స్ ఉన్నాయి. వాటి గురుంచి ఇప్పుడు తెలుసుకుందాం..(ఇది కూడా చదవండి: మీ పేరుతో ఎవరైనా మొబైల్ సిమ్ తీసుకున్నారో తెలుసుకోండిలా?)
ట్రిక్ 1: సాదారణంగా మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ చేస్తే వారి స్టేటస్ మీకు కనిపించదు.
ట్రిక్ 2: మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ చేస్తే ఆ వ్యక్తి ప్రొపైల్ ఫోటో మీకు కనిపించదు. ఒకవేళ కనిపించిన ఆ ప్రొఫైల్ పిక్చర్ బ్లాంకుగా కనిపిస్తుంది.
ట్రిక్ 3: మీరు ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ చేశారని తెలియక వారికి మెసేజ్ పంపితే కేవలం సింగిల్ టిక్ మాత్రమే కనిపిస్తుంది. బ్లూటిక్ కాని అలాగే డబుల్ టిక్ కాని కనిపించదు.
ట్రిక్ 4: అలాగే బ్లాక్ చేసిన వ్యక్తికి మీరు ఎటువంటి కాల్ కాని, వాయిస్ మెసేజ్ కాని పంపలేరు.
ట్రిక్ 5: ఒకవేల మీరు ఏదైన ఓక గ్రూపు క్రియేట్ చేసి అందులో మిమ్మల్ని బ్లాక్ చేసిన వ్యక్తిని జత చేయాలని అనుకున్నప్పుడు మీకు You are not authorized to add this contact అనే మెసేజ్ కనిపిస్తుంది. దాని అర్ధం వారు మిమ్మల్ని బ్లాక్ చేశారని.
మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.