వాట్సాప్ లో చాలా తక్కువ సందర్భాలలో ముఖ్యమైన డిలీట్ చేసిన సందేశాలను చదవాల్సి వస్తుంది. వాట్సాప్ లో డిలీట్ చేసిన మెసేజ్ లను మళ్లీ తిరిగి పొందటానికి ప్రత్యేకంగా ఎటువంటి ఫీచర్ మాత్రం ఇప్పటివరకు లేదు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే ఈ చిన్న యాప్ సహాయంతో డిలీట్ చేసిన మెసేజ్ లను చదవచ్చు.
అయితే ఈ సదుపాయం ఆండ్రాయిడ్ వాట్సప్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఐఓఎస్ యూజర్లకు మాత్రం కాదు. డిలీట్ చేసిన మెసేజ్ లను తిరిగి పొందటానికి ఈ క్రింద చెప్పిన విధంగా చేయండి.
- గూగుల్ ప్లేస్టోర్ నుంచి నోటిసేవ్ అనే యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలి.
- ఇన్ స్టాల్ చేసుకున్న అనంతరం నోటిసేవ్ యాప్ కి నోటిఫికేషన్‌లు, ఫోటోలు, మీడియా, ఫైల్స్ చదివేలా మీరు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది.
- యాప్ ఇన్స్టాల్ చేసుకున్నప్పటి నుంచి డిలీటెడ్ మెసేజ్ లను చదివే అవకాశం ఉంటుంది.
- అలాగే, మీ స్నేహితులు పెట్టిన స్టేటస్ వీడియోలను కూడా సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
మీరు అనుమతులు ఇచ్చిన వెంటనే వాట్సాప్ తో పాటూ ప్రతి ఒక్క మెసేజ్ ను స్టోర్ చేసుకుంటుంది. వాటిని మీరు ఓపెన్ చేసి చదువుకోవచ్చు. కాకపోతే డిలీటెడ్ వాట్సాప్ మెసేజ్ లను తిరిగిపొందాలంటే నెలకు రూ.65 చెల్లించాల్సి ఉంటుంది. తద్వారా జిఫ్ మెసేజెస్, ఫోటోలు, వీడియోలు, మీడియా ఫైల్స్ తిరిగి పొందవచ్చు.
Support TechPatashala
మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.