కరోనా మహమ్మారితో ప్రజలు భాదపడుతున్న ఈ కష్ట కాలంలో దేశంలోని అతిపెద్ద బ్యాంకు ఎస్‌బీఐ తన ఖాతాదారులకు అండగా నిలిచింది. కరోనా చికిత్స కోసం భారీ మొత్తంలో ఖర్చు చేసి ఆర్థిక ఒత్తిడితో చితికిపోతున్న మధ్య తరగతి కుటుంబాలను ఆదుకోవడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ‘కవాచ్ పర్సనల్ లోన్’ పేరుతో ఎటువంటి సెక్యూరిటీ లేకుండానే రుణాలను అందిస్తుంది.
కోవిడ్-19 చికిత్స కోసం వినియోగదారులకు తన, కుటుంబ సభ్యుల వైద్య ఖర్చుల కోసం దేశంలోని అతిపెద్ద బ్యాంక్ ఎస్‌బీఐ 8.5 శాతం వార్షిక వడ్డీ రేటుతో రూ.25 వేల నుంచి రూ.5 లక్షల వరకు వ్యక్తిగత రుణాలను అందిస్తుంది. ఈ లోన్ కోసం ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ రుణాలను తీసుకున్న వారు గరిష్టంగా 60 నెలల కాలంలో తిరిగి చెల్లించాలి. ఇంకా లోన్ తీసుకున్న వారికి ఎటువంటి ఇతర ఫీజులు లేకపోవడంతో పాటు మూడు నెలలు ఈఎమ్ఐ కూడా చెల్లించాల్సిన అవసరం కూడా లేదని ఎస్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. కోవిడ్ సహాయక చర్యలలో భాగంగా ఆర్‌బీఐ అందిస్తున్న సేవలకు అనుగుణంగా బ్యాంకులు అందిస్తున్న కోవిడ్ -19 ప్రత్యేక రుణాలలో కింద ‘కవాచ్ పర్సనల్ లోన్’ వస్తుందని ఎస్‌బీఐ పేర్కొంది.
“ఈ కరోనా మహమ్మారి కాలంలో కోవిడ్ సోకిన కుటుంబాలకు ఎటువంటి సెక్యూరిటీ లేకుండానే వ్యక్తిగత రుణాలను అందిస్తున్నాము. ముఖ్యంగా ఈ క్లిష్ట పరిస్థితిలో మా ఖాతాదారుల కుటుంబాలు ఆర్ధికంగా ఊబిలో చిక్కుకోకుండా ఉండటానికి దీనిని ప్రవేశ పెట్టినట్లు” ఎస్‌బీఐ ఛైర్మన్ దినేష్ ఖారా వెల్లడించారు.
Support Tech Patashala
మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.