Simple One Electric Scooter: సింపుల్ ఎనర్జీ భారతదేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంఛ్ చేసింది. ఈ స్కూటర్ ఓలా ఎలక్ట్రిక్ ఎస్1 ప్రొ, ఎథర్ 45ఎక్స్ గట్టి పోటీ ఇచ్చే విధంగా కనిపిస్తుంది. ఇంకో మాట చెప్పాలంటే ఇండస్ట్రిలో బెస్ట్ పర్ఫార్మన్స్, లాంగ్ రేంజ్ గల స్కూటర్ ఇదే అని చెప్పుకోవచ్చు.
లాంఛ్ ఈవెంట్ సందర్భంగా సింపుల్ ఎనర్జీ వ్యవస్థాపకుడు శ్రేష్ఠ్ మిశ్రా మాట్లాడుతూ.. 13 రాష్ట్రాల్లో ఛార్జింగ్ నెట్ వర్క్ నిర్మించాలని సింపుల్ ఎనర్జీ యోచిస్తోంది. ఈ రాష్ట్రాల్లో సుమారు 300కి పైగా ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది.
203 కిలోమీటర్ల రేంజ్
ఇది ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే ఎలక్ట్రిక్ స్కూటర్ అని శ్రేష్ఠ్ మిశ్రా తెలిపారు. ఈ స్కూటర్ ఎకో మోడ్(45-60 KMPH)లో 203 కిలోమీటర్ల రేంజ్, ఐడీసీ మోడ్ లో 236 కిలోమీటర్ల వెళ్లనున్నట్లు తెలిపారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాంజ్ బ్లాక్, అజ్యూరే వైట్, బ్రెంజ్ వైట్, నమ్మ రెడ్ వంటి రంగులలో లభ్యం అవుతుంది. కస్టమర్లు దీనిని రూ.1947 చెల్లించడం ద్వారా సింప్లీ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్ చేసుకోవచ్చు. వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ గంటకు 105 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకోగలదు.
4.8 కెడబ్ల్యుహెచ్ బ్యాటరీ
ఈ బైక్ 4.8 కెడబ్ల్యుహెచ్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఇది ఐపీ67 వాటర్, దూలి నిరోధకత గల బ్యాటరీ. ఇది 72 ఎన్ఏం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ బ్యాటరీలో పవర్ ఉత్పత్తి చేసే 27000 సెల్స్ ఉన్నాయి. బైక్ కేవలం 2.9 సెకన్లలో గంటకు 0-40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. కొత్తగా లాంఛ్ చేసిన స్కూటర్లలో 7 ఇంచ్ డిస్ప్లే, 4జీ, బ్లూటూత్ 5.2కు సపోర్ట్ చేస్తుంది. ఈ బైక్ 30 లీటర్ల బూట్ సామర్ధ్యాన్ని కలిగి ఉంది.
ఈ సింపుల్ వన్ స్కూటర్ ఎక్స్ షోరూమ్ ధర రూ.1,09,999గా ఉంది. వివిద రాష్ట్రాలు ఇచ్చే సబ్సిడీతో ధర ఇంకొంచెం తగ్గే అవకాశం ఉంది. దీనిలో ఏకొ, రైడ్, డ్యాష్, సోనిక్ అనే నాలుగు మోడులు ఉన్నాయి. ఇందులో రెండూ బ్యాటరీలు ఉంటాయి. ఒకటి పోర్టబుల్ బ్యాటరీ మరొకటి నాన్ పోర్టబుల్ బ్యాటరీ. ఈ 7 కేజీల పోర్టబుల్ బ్యాటరీని చార్జ్ చేయడానికి 75 నిమిషల సమయం పడితే, ఫుల్ చార్జ్ చేయడానికి 6 గంటల సమయం పడుతుంది.