ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్ తీసుకొని వచ్చింది. అయితే ఇప్పటికీ కొన్ని ముఖ్యమైన ఫీచర్స్ తీసుకొని రాలేదు ఇందులో ప్రధానమైనది వాయిస్ కాల్ రికార్డింగ్. ఇది ఇంకా అందుబాటులోకి రాలేదు. కొన్ని ట్రిక్స్ ఉపయోగిస్తే వాట్సప్ కాల్స్ రికార్డ్ చేయొచ్చు.
ఇదేమీ పెద్ద సీక్రెట్ కూడా కాదు. ఇందుకోసం థర్డ్ పార్టీ యాప్స్ ఉపయోగించాల్సి ఉంటుంది. మరి వాట్సప్ కాల్స్ ఎలా రికార్డ్ చేయొచ్చో తెలుసుకుందాం. ఆండ్రాయిడ్ యూజర్లు వాట్సప్ కాల్స్ రికార్డ్ చేయాలంటే థర్డ్ పార్టీ యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్లేస్టోర్‌లో ఉన్న రికార్డింగ్ యాప్స్ వాటిని డౌన్‌లోడ్ చేసిన తర్వాత వాట్సప్ కాల్ చేస్తే రికార్డింగ్ ఆప్షన్ చూపిస్తుంది.
రికార్డింగ్ ఆన్ చేస్తే వాట్సప్ కాల్స్ కూడా రికార్డ్ అవుతాయి. అందుకోసం క్యూబ్ కాల్ రికార్డర్ అనే యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలి. క్యూబ్ కాల్ రికార్డర్ యాప్ ఫోన్ కాల్స్, సీగ్నల్, స్కైప్ 7, స్కైప్ లైట్, వైబర్, వాట్సప్, హ్యాంగవుట్స్, ఫేస్ బుక్, ఐఎంఓ, వీచాట్, కాకావో, లైన్, స్లాక్, టెలిగ్రామ్ 6, మెసెంజర్ 6 వంటి యాప్స్ వాయిస్ రికార్డ్ చేయగలదు.
- మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి Cube Call Recorder App యాప్ ని మీ మొబైల్ లోకి డౌన్లోడ్ చేసుకుని ఇన్ స్టాల్ చేయండి.
- ఆ తర్వాత వాట్సప్ నుంచి కాల్ చేయగానే మీ స్క్రీన్ మీద వాట్సప్ కాల్ రికార్డు చేయాలా అనే ఆప్షన్ కనిపిస్తుంది.
- మైక్రోఫోన్ ఐకాన్ మాదిరిగా ఉన్న ఈ బటన్ ని ట్యాప్ చేయండి. వెంటనే కాల్ రికార్డ్ అవుతుంది.
- ఆడియో క్లారిటీ కోసం కాల్ రికార్డు అయిన తర్వాత మైక్రోఫోన్ ఐకాన్ మాదిరిగా రికార్డింగ్ ఆప్సన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే కొన్ని రకాల ఆప్షన్లు కనిపిస్తాయి.
- అందులో రికార్డింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు కనిపించే voip recording అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. దాన్నిట్యాప్ చేస్తే మైక్రోఫోన్ అనే ఆప్షన్ సెలక్ట్ చేసుకుంటే సరిపోతుంది.
ఐఫోన్లో రికార్డ్ చేయడం ఎలా
ఐఫోన్లో వాట్సప్ కాల్స్ రికార్డ్ చేయాలంటే సెకండరీ డివైస్ అవసరం అవుతుంది. మీరు మీ ఐఫోన్ ని మాక్ సిస్టంకు కనెక్ట్ చేసిన తర్వాత మీ మాక్ సిస్టంలో క్విక్ టైం ప్లేయర్ ఓపెన్ చేయండి. అందులో ఫైల్ మెనూ అనే ఆప్సన్ ఓపెన్ చేసి అందులో న్యూ ఆడియో రికార్డ్ సెలక్ట్ చేసుకోండి.
మీ సెకండరీ డివైస్ నుంచి మీరు వాట్సప్ కాల్ చేయండి. కాల్ కనెక్ట్ అయిన తరువాత పైన కనిపించే గ్రూపు కాలింగ్ బటన్ ని క్లిక్ చేసినట్లయితే మీకు అక్కడ ఐఫోన్ యూజర్ అనే ఆప్సన్ కనపడుతుంది. కాల్ మాట్లాడటం అయిపోయిన తర్వాత దాన్ని స్టాప్ చేస్తే అది ఆటోమేటిగ్గా మీ మ్యాక్ లో సేవ్ అవుతంది.